Site icon NTV Telugu

Viral : గాలిలో తేలియాడుతున్న రాయి.. మేధావులకి అంతుచిక్కని వైనం

New Project

New Project

Viral : తరచుగా సోషల్ మీడియాలో చాలా ఫోటోలు వైరల్ అవుతుంటాయి. కానీ వాటి వెనుక ఉన్న నిజం కనిపించే దానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఫోటోలు మనకు భ్రమను కల్పిస్తాయి. దీంతో మనం చాలా సులభంగా గందరగోళానికి గురవుతాం. అలాంటి ఓ ఫోటో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది. మొదటి సారి ఈ ఫోటో చూడగానే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది. నిజం తెల్సుకోవాలంటే కాసేపు పరీక్షించాల్సిందే.

Read Also: పుణ్యక్షేత్రాల్లో రాళ్లు పేరిస్తే ఇల్లు కడతామా!

‘గాలిలో ఎగురుతున్న రాయి’కి సంబంధించిన ఫోటో ఒకటి ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.. అది ఎలా వేలాడుతుందో అర్థం కావడం లేదు. దీని వెనుక ఉన్న కారణం తెలుసుకుని అరె అంటూ నాలుక కరుచుకోవాల్సిందే. ఒక నెటిజన్ ఫోటోను షేర్ చేస్తూ “మీ మెదడుతో ఆప్టికల్ ఇల్యూషన్ ఎలా ఆడుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ” అని రాశారు. ఒక వ్యక్తి మొదట ఫోటోను చూసినప్పుడు.. నిజంగా గాలిలో తేలియాడే రాయిని చూస్తున్నట్లే కనిపిస్తుంది. కానీ నిజం ఏమిటంటే, ఈ రాయి నీటిలో ఉంది. ఇది ప్రతిబింబంలో సగం రాయిని చూపుతోంది. ఈ రాయి నీటిలో తేలియాడుతుందని ప్రజలు గుర్తించి చాలా మంది షాక్ అయ్యారు. ఈ ఫోటో గంటల తరబడి ఆలోచించేలా చేస్తుంది.

Exit mobile version