పుణ్యక్షేత్రాల్లో రాళ్లు పేరిస్తే ఇల్లు కడతామా! 

సొంత ఇల్లు ఈ భూమ్మీద ఉండే ప్రతీ ఒక్కరి కల. చిన్నదో, పెద్దదో ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకుంటాడు. 

ఈ కల అందరికి నెరవేరదు. డబ్బు లేక కొందరు ఇల్లు కట్టుకోలేరు. మరికొందరికి డబ్బులున్నా పరిస్థితులు అనుకూలంగా ఉండవు. 

జాతకంలో రాసిపెట్టి ఉంటేనే గృహ యోగం కలుగుతుందట. దేవాలయాలు పరిసరాల్లోని తీర్థాల్లో రాళ్లు పేరుస్తుంటారు కొందరు. 

అలా రాళ్లు పేరిస్తే గృహయోగం కలుగుతుందని నమ్ముతుంటారు. పైగా ఎంత ఎత్తు రాళ్లు పేరిస్తే అన్ని అంతస్థుల ఇల్లు కడతారని నమ్ముతుంటారు. 

అయినా పుణ్య ప్రదేశాలలో రాళ్ళు పేర్చితే గృహ యోగం కలుగుతుంది అనేది కొందరి నమ్మకం. కానీ అలా జరిగిన దాఖలాలు ఎక్కడా దొరకలేదు. 

 ఎవరో ఇలాంటివి మొదలు పెడతారు. ఇక ఆ తర్వాత కొందరు అనుసరిస్తారు. చివరికి ఇదో సంప్రదాయం అయిపోతుంది. 

వయసులో ఏదో ఒక దశలో సొంతిల్లు అవసరమని అనిపిస్తుంది. వయసు పైబడిన తర్వాత సొంతిల్లు అక్కర మరింత తెలుస్తుంది. అది గుర్తుచేయడం కోసమే పుణ్యక్షేత్రాల్లో ఇలా చేస్తుంటారు. 

పుణ్యక్షేత్రాల్లో రాళ్లు పేరిస్తే గృహయోగం ఉంటుందో లేదో పక్కన పెడితే.. ఆ ఆలోచన రావడం మంచిదే కదా.. !