Jagadish Reddy: శాసన సభ సమావేశాలు సజావుగా జరగకుండా చేయాలని పాలకపక్షం కుట్ర పన్నిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రధాన ప్రతిపక్షం సభకు రాకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. శాసనసభ బయటే ప్రధాన ప్రతిపక్షమైన మమ్మల్ని అడ్డగించడం దారుణమని.. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు.మేము అదానీ, రేవంత్ ఉన్న టీ షర్ట్ వేసుకుని సభకు పోతే తప్పేమిటని ప్రశ్నించారు. మేము ఏ బట్టలు వేసుకుని రావాలనేది స్పీకర్ చెబుతారా అంటూ ప్రశ్నలు గుప్పించారు.
పార్లమెంట్‌లో రోజూ రాహుల్ అదానీ దుర్మార్గాల మీదనే మాట్లాడుతున్నారని.. ఇక్కడ రేవంత్ అదానీని వెనుకేసుకు వస్తున్నారని అన్నారు. అదానీకి తెలంగాణ సంపద దోచిపెట్టేందుకు రేవంత్ కుట్ర పన్నాడని ఆరోపించారు. రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ, లగచర్లలో పరిశ్రమలు అదానీ కోసమేనని ఆరోపణలు చేశారు. రాహుల్ కూడా అదానీ టీ షర్ట్ ధరిస్తే పార్లమెంటులోకి అనుమతించారు.. ఇక్కడ ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. రాహుల్ గాంధీనే మేము అనుసరించామన్నారు. ఉభయ సభలు రేవంత్ నడువుతున్నారా.. స్పీకర్, కౌన్సిల్ ఛైర్మన్ నడుపుతున్నారో చెప్పాలన్నారు. రాహుల్‌ది ఒప్పు అయితే మేము చేసింది తప్పని స్పీకర్, ఛైర్మన్ ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను బీఆర్‌ఎస్ సభలో లేవనెత్తకుండా చేయాలని ప్రభుత్వం మమ్మల్ని అడ్డుకుందన్నారు. తెలంగాణ ప్రకటన డిసెంబర్ 9న ఎలా వచ్చిందో అందరికీ తెలుసన్నారు.
Read Also: Farmers Protest: మిల్లులో పత్తి కొనుగోళ్లు నిలిపివేత.. రోడ్డుపై బైఠాయించిన రైతులు
ఈ రోజు ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని.. ప్రతిపక్షాన్ని సభలోకి రాకుండా చేయడం మా హక్కులను కాలరాయడమేనని శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనా చారి అన్నారు. స్పీకర్, ఛైర్మన్ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకకూడదన్నారు. అప్రకటిత ఎమర్జెన్సీ రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు. ఎక్కడ చూసినా పోలీసులు కనబడుతున్నారని.. ప్రభుత్వం ఉన్నట్టు లేదన్నారు. సీఎం పదవికున్న స్థాయిని రేవంత్ దిగజార్చారని విమర్శించారు. రేవంత్‌కు అహంకారం, అభద్రత రెండూ పెరిగిపోయాయని మధుసూదనా చారి అన్నారు.