200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oppo Find X10 Forest Green Edition: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తమ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ‘ఒప్పో ఫైండ్ ఎక్స్10’ (Oppo Find X10) లో సరికొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గతనెలలో చైనా మార్కెట్లో ఒప్పో ఫైండ్ ఎక్స్10, ఫైండ్ ఎక్స్10ఈ, ఫైండ్ ఎక్స్10 ప్రో మ్యాక్స్ ఫోన్లు విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు వీటికి తోడుగా ప్రముఖ కళాకారిణి కార్లోటా ఫ్రేయర్తో కలిసి ప్రత్యేకంగా డిజైన్ చేసిన నాలుగో కలర్ వేరియంట్ ‘ఫారెస్ట్ గ్రీన్’ (Forest Green) ఎడిషన్‌ను ఒప్పో అధికారికంగా విడుదల చేసింది.
ఈ సరికొత్త ఒప్పో ఫైండ్ ఎక్స్10 ఫారెస్ట్ గ్రీన్ వేరియంట్ ప్రస్తుతం ఉన్న డిజైన్‌కు నాచు ఆకుపచ్చ (మోస్ గ్రీన్) రంగు పూతతో ఆకర్షణీయమైన రూపాన్ని సంతరించుకుంది. చైనా మార్కెట్లో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ప్రారంభ ధర 5,499 యువాన్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 78,000)గా నిర్ణయించారు. ఇది 12 జీబీ + 512 జీబీ, 16 జీబీ + 512 జీబీ, 16 జీబీ + 1 టీబీ కాన్ఫిగరేషన్లలో కూడా అందుబాటులో ఉంది. వినియోగదారులు ఒప్పో చైనా అధికారిక ఈ-స్టోర్ ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు. కాగా, భారతదేశంలో ఈ ఫోన్ గ్లాసియర్ బ్లూ, గ్లో కోరల్, మిస్ట్ గ్రే రంగుల్లో గత వారమే ప్రారంభమైంది. భారత మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 1,39,999గా ఉంది. అయితే ఈ సరికొత్త ఫారెస్ట్ గ్రీన్ కలర్ వేరియంట్ భారత్‌లో విడుదలవుతుందా లేదా అనేదానిపై కంపెనీ ఇంకా స్పష్టతనివ్వలేదు.
Also Read
- Vivo Y600: 10,000mAh బ్యాటరీతో Vivo Y600 లాంచ్.. 120Hz AMOLED డిస్ప్లే, MediaTek ప్రాసెసర్‌తో అద్భుతమైన ఫీచర్స్!
- Amazon Sale: దీపావళి క్లీనింగ్ భయం అక్కర్లేదు.. రూ. 3వేల లోపే లభిస్తున్న బెస్ట్ 2-ఇన్-1 వాక్యూమ్ క్లీనర్ మీకోసం..
- ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!
- HP Star Book Air 14: HP Star Book Air 14 ల్యాప్‌టాప్ లాంచ్.. OLED టచ్‌స్క్రీన్, 42.5 గంటల బ్యాటరీ బ్యాకప్!
రంగు మినహా ఫోన్ స్పెసిఫికేషన్లలో ఎలాంటి మార్పులూ లేవు. 6.59 అంగుళాల 1.5K LTPO అమోలెడ్ (AMOLED) డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 3,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఒప్పో క్రిస్టల్ గార్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ డిస్ప్లే కలిగి ఉంది. అలాగే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9600M చిప్సెట్, కలర్ఓఎస్ 17 ఆధారిత ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంది. ఇందులో గరిష్టంగా 16 జీబీ LPDDR5X ర్యామ్, 512 జీబీ వరకు UFS 4.1 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఇంకా ఇందులో హాసిల్‌బ్లాడ్ ట్యూనింగ్‌తో కూడిన 200 MP (శాంసంగ్ HPE) ప్రధాన కెమెరా, 200 MP (శాంసంగ్ HP5) టెలిఫోటో లెన్స్, 50 MP అల్ట్రా-వైడ్ కెమెరా. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50 MP కెమెరాను అందించారు. అలాగే ఇది 8,000 mAh భారీ బ్యాటరీ, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంది. నీరు, దుమ్ము నుంచి అత్యున్నత రక్షణ కోసం IP66 + IP68 + IP69 రేటింగ్‌లు, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్లు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, వై-ఫై 7, బ్లూటూత్ 6.0, డ్యూయల్ సిమ్ 5జీ, యూఎస్బీ-సి 3.2 జెన్ 1 పోర్ట్ ఉన్నాయి.
తాజావార్తలు
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊరట.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
-
Arnab Cyclone Alert: పెనుగండంగా ‘అర్నాబ్’ తుఫాన్.. కుంభవృష్టి వర్షాలు.. ఆ జిల్లాలకు పెను ముప్పు!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్ సమీపంలో అగ్నిప్రమాదం కలకలం.. నార్త్ బ్లాక్‌కు 6 ఫైర్ ఇంజిన్లు!
ట్రెండింగ్
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!