Oppo Find N3 Flip SmartPhone Launch and Price in India: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ‘ఒప్పో’ నుంచి మరో ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. గత ఆగస్టులో చైనాలో విడుదలైన ‘ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్’ ఫోన్‌ను గురువారం భారత్ మార్కెట్లోకి కంపెనీ లాంచ్ చేసింది. ఈ ఏడాది తీసుకొచ్చిన ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోన్‌కు కొనసాగింపుగా ఫైండ్ ఎన్3 ఫ్లిప్‌ను ఒప్పో తీసుకొచ్చింది. 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ మెయిన్ డిస్‌ప్లే, ఆండ్రాయడ్ 13 ఆధారిత కలర్ ఓఎస్ 13.2, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ ఓఐఎస్ లాంటి ఫీచర్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.
Oppo Find N3 Flip Price:
ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ ఫోన్ 12జీబీ + 256జీబీ వేరియంట్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 94,999గా ఒప్పో కంపెనీ నిర్ణయించింది. అక్టోబర్ 22 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్, దేశవ్యాప్తంగా పలు రిటైల్ స్టోర్లలో అమ్మకాలు ఆరంభం కానున్నాయి. రూ. 8వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ. 12వేల వరకు పలు కార్డులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి.
Oppo Find N3 Flip Display:
ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్‌లో రెండు స్క్రీన్స్ ఉంటాయి. మెయిన్ డిస్‌ప్లేలో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ ఉంటుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేటుతో వస్తోంది. 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. ఔటర్ డిస్‌ప్లే 3.26 అంగుళాల ఎస్‌డీ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 60 Hz రిఫ్రెష్ రేటు, 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. దీనికి గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డిమెన్‌సిటీ 9200 ప్రాసెసర్ ఉండగా.. ఆండ్రాయడ్ 13 ఆధారిత కలర్ ఓఎస్ 13.2తో పని చేస్తుంది.
Also Read: World Cup 2023 Points Table: టాప్‌లో దక్షిణాఫ్రికా.. 9వ స్థానంలో ఆస్ట్రేలియా! భారత్ ప్లేస్ ఎక్కడంటే?
Oppo Find N3 Flip Camera and Battery:
ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్‌లో 50ఎంపీ ఓఐఎస్ ప్రధాన కెమెరాతో పాటు 48 ఎంపీ కెమెరా, 32 ఎంపీ టెలిఫొటో లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా ఉంటుంది. అలర్ట్ స్లయిడర్ కూడా ఉంటుంది. ఇందులో 4300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. అది 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బరువు 198 గ్రాములు కాగా.. క్రీమ్ గోల్డ్, మిస్టీ పింక్, స్లీక్ బ్లాక్ కలర్లలో అందుబాటులో ఉంటుంది. శామ్‌సంగ్ గెలాక్సీ జెట్ ఫ్లిప్ 5, మోటోరోలా రాజర్ 40 ఆల్ట్రాతో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ పోటీ పడనుంది.