NTV Telugu Site icon

OPPO Diwali 2024 Offers: ఒప్పో ఫోన్లపై భారీ ఆఫర్స్.. 10 లక్షలు కూడా గెలుచుకోవచ్చు!

Oppo Diwali 2024

Oppo Diwali 2024

OPPO Offers for Diwali 2024: దీపావళి పండగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ‘ఒప్పో’ మరోసారి గ్రాండ్ సేల్‌తో ముందుకువచ్చింది. ‘పే జీరో, వర్రీ జీరో, విన్‌ రూ.10 లక్షలు’ పేరిట దీపావళి 2024 సేల్‌ను ఒప్పో ఇండియా భారత్‌లో తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్.. నవంబర్ 5 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో ఒప్పో రెనో 12 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్‌27 ప్రో+ 5జీ స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన డీల్‌లను అందిస్తుంది. వీటిపై 12 నెలల నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం ఉంది.

ఈ సేల్‌లో ఎంపిక చేసిన వాటి కొనుగోళ్లపై క్యాష్‌ ప్రైజ్‌లు, ఒప్పో ఫైండ్ ఎన్‌3 ఫ్లిప్‌ ఫోన్లను కంపెనీ అందించనుంది. నో కాస్ట్‌ ఈఎంఐ, జీరో డౌన్‌ పేమెంట్‌, జీరో ప్రాసెసింగ్‌ ఫీ, ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. కోటక్‌ బ్యాంక్‌, టీవీఎస్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీబీ ఫైనాన్స్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ యూజర్లకు 6 నుంచి 9 నెలల పాటు జీరో ప్రాససింగ్‌ ఫీ.. ఏడాది పాటు జీరో డౌన్‌ పేమెంట్‌ సదుపాయం అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌, కోటక్‌, ఆర్‌బీఎల్‌, డీబీఎస్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ యూజర్లకు 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ ఉంటుంది.

Also Read: Rohit Sharma: అభిమాని కోసం కారు ఆపిన రోహిత్.. వీడియో వైరల్!

ఒప్పో రెనో 11 సిరీస్‌, ఒప్పో ఎఫ్‌25 ప్రో, ఒప్పో ఎఫ్‌27 5జీ, ఒప్పో ఏ3 ప్రో5జీ, ఒప్పో కే12 ఎక్స్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. నవంబర్‌ 5లోపు కొనుగోలు చేసే వారికి ఒప్పో ఫైండ్‌ ఎ3 ఫ్లిప్‌, ఒప్పో ఎక్నో బడ్స్‌2, ఒప్పో ప్యాడ్‌, లక్ష రూపాయలు గెలుచుకొనే ఛాన్స్ ఉంది. ఒప్పో రిటైల్‌ స్టోర్‌, ఒప్పో ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేసిన వారు ఈ ప్రయోజనాలు పొందొచ్చని ఒప్పో ఇండియా పేర్కొంది.

Show comments