Indian Naval Power: భారత దేశం తన అజేయమైన శక్తిసామర్థ్యాలను ఆపరేషన్ సింధూర్‌తో ప్రపంచానికి చాటిచెప్పింది. భారత నావికాదళం క్రమంగా హిందూ మహాసముద్రంలో సూపర్ పవర్‌గా మారుతోంది. మే నెలలో పాకిస్థాన్‌పై ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఈ విషయాన్ని ప్రపంచానికి రుజువు చేసింది. ఇరుదేశాల మధ్య వివాదం ప్రారంభమైన తర్వాత, పాక్ నావికాదళాన్ని దాని స్వంత భూభాగంలోనే 15 మిగ్-29కె విమానాలతో చుట్టుముట్టినట్లు భారత వైస్ అడ్మిరల్ తాజాగా వెల్లడించారు.
READ ALSO: Prabhas : వార్-2ను దెబ్బ కొట్టిన కూలీ.. ప్రభాస్ రివేంజ్ తీరుస్తాడా..?
మధ్యప్రదేశ్‌లోని డాక్టర్ అంబేద్కర్ నగర్‌లోని ఆర్మీ వార్ కాలేజీలో జరిగిన రణ్ సంవాద్-2025లో డిప్యూటీ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ (DCNS) వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇండియన్ నేవీ శక్తిసామర్థ్యాల గురించి, ఆపరేషన్ సింధూర్ సమయంలో నేవీ పని తీరు గురించి ఆయన వివరించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భారత నావికాదళం ప్రధాన యుద్ధనౌక TROPEX అప్పటికే ప్రారంభమైంది. దానితో పాటు అనేక యుద్ధనౌకలు పశ్చిమ తీరంలో మోహరించబడ్డాయని తెలిపారు. ఆపరేషనర్ సింధూర్ ప్రారంభమైన వెంటనే అన్ని యుద్ధ నౌకలను కేవలం 96 గంటల్లో సముద్రంలోకి మోహరించినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం ఆపరేషన్‌ను భారత స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధనౌక INS విక్రాంత్ నాయకత్వం వహిచింది. ఈ యుద్ధనౌకపై 15 MiG-29K యుద్ధ విమానాలు మోహరించబడ్డాయి. విక్రాంత్‌తో పాటు డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు, జలాంతర్గాములతో కూడిన టాస్క్ ఫోర్స్ హిందూ మహాసముద్రంలో మోహరించబడింది.
దీంతో పాకిస్థాన్ నావికాదళం కరాచీకి దక్షిణంగా ఉన్న అంతర్జాతీయ జలాల్లోని దాని ఓడరేవులకే పరిమితం అయ్యింది. భారత నావికాదళం ఇంత బలంగా మోహరించిన తర్వాత, పాకిస్థాన్ నావికాదళం సముద్రంలోకి ప్రవేశించడానికి ధైర్యం చేయలేకపోయిందన్నారు. భారత నావికాదళం ఎటువంటి ప్రత్యక్ష పోరాటం లేకుండా దానిపై పూర్తి ఒత్తిడిని తెచ్చిందని చెప్పారు. పాకిస్థాన్ నావికాదళం మన తీరప్రాంతాన్ని, వాణిజ్య మార్గాలను, సముద్ర ఆర్థిక మార్గాలను బెదిరించలేని విధంగా చూడటం తమ లక్ష్యమని వైస్ అడ్మిరల్ సోబ్టి అన్నారు.
‘నాన్-కాంటాక్ట్ వార్‌ఫేర్’
ఉపగ్రహాలు, డ్రోన్లు, తీరప్రాంత రాడార్లు, దీర్ఘ శ్రేణి క్షిపణుల సహాయంతో భారత నావికాదళం తన సరిహద్దుల్లోనే శత్రువులను ఆపగలదని ఆపరేషన్ సింధూర్ నిరూపించిందన్నారు. దీనిని నాన్-కాంటాక్ట్ వార్‌ఫేర్ అంటారని, ఇక్కడ సరిహద్దు దాటకుండానే వ్యూహాత్మక ప్రయోజనాన్ని సాధించవచ్చని చెప్పారు. ఈ ఆపరేషన్ నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకున్నామని చెప్పారు. ఎర్ర సముద్రం, అడెన్ గల్ఫ్‌లో హౌతీ తిరుగుబాటుదారులు వినియోగిస్తున్న తక్కువ ధర డ్రోన్‌లు పెద్ద ముప్పుగా మారుతున్నాయని అన్నారు. ఇలాంటి తక్కువ ఖర్చుతో నాశనం చేయగల వ్యవస్థలు నావికాదళానికి అవసరమని చెప్పారు.
READ ALSO: Radhakumari Success: ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలు.. చరిత్ర సృష్టించిన రాధాకుమారి..
