Site icon NTV Telugu

Veer Chakra winners: ఆపరేషన్ సింధూర్ హీరోలకు మెడల్స్…

06

06

Veer Chakra winners: భారతదేశం 79వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్‌లో తమ పరాక్రమాన్ని ప్రదర్శించిన దేశ భద్రతా దళాల సైనికులను వారి అసాధారణ ధైర్యసాహసాలు, విశిష్ట సేవలకు గుర్తింపుగా వారిని కేంద్రం సత్కరించనుంది. భారత వైమానిక దళానికి చెందిన 13 మంది అధికారులకు ‘యుద్ధ సేవా పతకం’, 9 మంది అధికారులకు ‘వీర్ చక్ర’ అవార్డులు లభించాయి. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారతదేశం పాక్‌లోని 9 ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’లో భాగంగా దాడి చేసిన విషయం తెలిసిందే.

READ MORE: Hyderabad Crime: కొందరికి సింబల్‌గా “గన్‌”.. ఈ ముఠాకు వాళ్లే టార్గెట్..!

వీర్ చక్ర అవార్డులు.. 9 మందికి
ఆపరేషన్ సింధూర్‌లో ఉగ్రవాద గ్రూపుల ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్న యుద్ధ పైలట్‌లు సహా 9 మంది అధికారులకు ‘వీర్ చక్ర’ అవార్డులను భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డులు భారతదేశ మూడవ అత్యున్నత యుద్ధకాల శౌర్య పురస్కారం. అవార్డులు పొందిన అధికారులు పాకిస్థాన్‌లోని మురిడ్కే, బహవల్‌పూర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన దాడులు చేశారు. దీనితో పాటు వారు పాకిస్థాన్ సైనిక ఆస్తులకు కూడా భారీ నష్టం చేశారు. ఈ ఆపరేషన్ సమయంలో భారత వైమానిక దళం కనీసం ఆరు పాకిస్థాన్ విమానాలను కూల్చివేసింది.

వీర్ చక్ర పురస్కారం పొందిన వారు..
1. రంజిత్ సింగ్ సిద్ధూ
2. మనీష్ అరోరా, SC
3. అనిమేష్ పట్ని
4. కునాల్ కల్రా
5. జాయ్ చంద్ర
6. సార్థక్ కుమార్
7. సిద్ధాంత్ సింగ్
8. రిజ్వాన్ మాలిక్
9. అర్ష్వీర్ సింగ్ ఠాకూర్

యుద్ధ సేవా పతకం.. 13 మందికి
రక్షణ, వైమానిక దాడులను విజయవంతంగా నిర్వహించినందుకు 13 మంది అధికారులకు ‘యుద్ధ సేవా పతకం’ లభించింది. ఈ గౌరవం పొందిన అధికారులలో ఎయిర్ వైస్ మార్షల్ జోసెఫ్ సువారెస్, ఎయిర్ వైస్ మార్షల్ ప్రజ్వల్ సింగ్, ఎయిర్ కమోడోర్ అశోక్ రాజ్ ఠాకూర్ వంటి సీనియర్ అధికారులు ఉన్నారు.

ఉత్తమ యుద్ధ సేవకు 4 అవార్డులు
ఆపరేషన్ సిందూర్ కోసం నలుగురు భారత వైమానిక దళ అధికారులకు సర్వోత్తమ యుద్ధ సేవా పతకం లభించింది. వీరిలో వైమానిక దళం వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ నరేంద్రేశ్వర్ తివారీ, వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ కమాండర్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా, ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ అవధేష్ భారతి ఉన్నారు.

భారత సైన్యానికి లభించిన పతకాలు..
ఉత్తమ యుద్ధ సేవా పతకం- 2
కీర్తి చక్రం – 4
ఉత్తమ్ యుద్ధ్ సేవా పతకం- 3
వీర్ చక్రం- 4
శౌర్య చక్రం – 8
యుద్ధ సేవా పతకాలు – 9
బార్ టు ఆర్మీ మెడల్ – 2
ఆర్మీ పతకాలు – 58
డిస్పాచెస్‌లలో ప్రస్తావనలు: 115

READ MORE: Darshan bail cancelled: బెయిల్ రద్దు… పోలీసుల అదుపులో కన్నడ హీరో..

Exit mobile version