Site icon NTV Telugu

Annamayya District: 78 మందితో ఇంటర్‌ కాలేజీ ప్రారంభం.. ఫస్ట్ ఇయర్‌లో ఒక్కరే పాస్!

Ap Inter Results2025

Ap Inter Results2025

అన్నమయ్య జిల్లా చిట్వేలి మండల కేంద్రంలో 78 మందితో నూతనంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రారంభమైంది. ఇటీవల నిర్వహించిన మొదటి సంవత్సరం పరీక్షలు అందరూ రాశాడు. తాజాగా ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కాగా.. ఈ 78 మంది విద్యార్థుల్లో ఒక్కరు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పాసైన విద్యార్థిని ఆనందల మల్లికకు 294 మార్కులు వచ్చాయి. మిగతా 77 మంది విద్యార్థిని విద్యార్థులు ఫెయిలయ్యారు. జూనియర్ కాలేజీ లో ప్రిన్సిపాల్, లెక్చలర్లు లేకపోవడంతో ఉత్తీర్ణశాతం పూర్తిగా దెబ్బతింది.

READ MORE: Arjun Son Of Vyjayanthi : అర్జున్ s/o వైజయంతి ట్రైలర్ రివ్యూ.. ఎలా ఉందంటే..?

కాగా.. నేడు ఏపీ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 70 శాతం ఉత్తీర్ణత సాధించగా.. రెండో ఏడాదిలో 83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ సందర్భంగా నారా లోకేశ్‌ మాట్లాడుతూ.. గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది నమోదైందని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌ కాలేజీల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఇంటర్‌లో మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులు, సిబ్బంది కృషి చేశారని కొనియాడారు.

READ MORE: Father Suicide: కూతురి ప్రేమ పెళ్లితో తండ్రి ఆత్మహత్య.. “బిడ్డను ఎలా చంపగలను” అంటూ సూసైడ్ లెటర్..

Exit mobile version