NTV Telugu Site icon

Leopard: చిరుత మళ్లీ వచ్చింది.. పచ్చర్లలో మహిళ, తిరుమలలో చిన్నారిని చంపింది ఒక్కటే

Cheetha

Cheetha

గతంలో తిరుమల కాలినడక మార్గంలో ఓ చిన్నారిని చిరుత చంపి తిన్న విషయం తెలిసిందే.. లక్షిత అనే ఆరేళ్ల బాలికపై దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లి చంపేసింది. అయితే.. భక్తులపై దాడికి పాల్పడటంతో అటవీ అధికారులు దానిని కొన్ని రోజులకు బంధించారు. అనంతరం.. నల్లమల అభయారణ్యంలో వదిలేశారు. అయితే.. ఆ చిరుతే మళ్లీ మనుషులపై దాడి చేస్తుంది. పచ్చర్లలో మెహరున్నీసా అనే మహిళను చంపి తింది. కాగా.. ఈ చిరుతను తిరుమలలో చిన్నారిని చంపి తిన్న చిరుతగా అటవీ అధికారులు నిర్ధారించారు.

Read Also: Nag Ashwin: కల్కిగా నటించబోయేది ఎవరంటే.. నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్

పచ్చర్లలో చిరుతను బంధించిన తరువాత నిర్ధారణకు వచ్చారు. తిరుమలలో చిన్నారిని చంపిన తరువాత ఒత్తిడి పెరగడంతో ఆ ప్రాంతంలో సంచరించే అన్ని చిరుతలను అధికారులు బంధించారు. కాగా.. కొన్ని నెలల తరువాత అధికారులు నల్లమల అరణ్యంలో వదిలిపెట్టారు. అయితే.. పచ్చర్లలో మహిళను చంపిన తరువాత తిరుమల చిరుతను ఇక్కడికి తెచ్చి వదిలారని అప్పట్లోనే గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. ఫారెస్ట్ వాచర్లు, రైల్వే కూలీలపైనా ఆ చిరుత దాడి చేసింది. అయితే.. మనుషుల పై దాడి చేయడం చిరుత స్వభావం కాదు.. అది మ్యాన్ ఈటర్ గా మారితేనే దాడి చేస్తుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. మనుషులను చంపిన చిరుతలను మళ్లీ అడవిలోకి వదలద్దని జనం చెబుతున్నారు.

Read Also: AP Assembly Sessions: అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఆర్థిక శాఖ తర్జన భర్జన..