ఫిబ్రవరి 14, ప్రేమికుల రోజు, ప్రేమికులు ఒకరికొకరు గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక ఇష్టమైన వాటిని తింటారు. సరదాగా గుడుపుతారు. ఇలా ఈరోజంతా ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతుంటారు. అయితే వాలెంటైన్స్ డే పురస్కరించుకుని ఆన్‌లైన్ మార్కెట్ కూడా మంచి లాభాలు రాబట్టింది. శుక్రవారం ఆన్‌లైన్ మార్కెట్ ఫుల్ సేల్ అయినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. జొమాటో యాజమాన్యంలోని బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. అత్యంత ఎక్కువగా ఆహారంతో పాటు గులాబీలు, చాక్లెట్లు, కేకులు, స్టఫ్డ్ బొమ్మలు, మరికొన్ని రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఈ మేరకు స్విగ్గీ ట్విట్టర్‌లో తెలిపింది.
ఇది కూడా చదవండి: Anji Reddy Chinnamile: నెరవేర్చలేని హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు ఓట్లతో బుద్ధి చెప్పాలి
‘‘గరిష్ట స్థాయిలో నిమిషానికి 581 చాక్లెట్ ఆర్డర్‌లు జరిగాయని.. నిమిషానికి 324 రోజ్ ఆర్డర్‌లు బుక్ అయ్యాయని.. ఇదే బుల్ రన్’’ అంటూ స్విగ్గీలో ట్విట్టర్‌లో పేర్కొంది. గతేడాది ప్రేమికుల రోజు కంటే ఈ ఏడాది రెండు రెట్లు ఎక్కువగా చాక్లెట్లు సేల్ అయినట్లుగా పేర్కొంది. ఇక గులాబీ ఆర్డర్లు సాధారణ రోజుల కంటే శుక్రవారం 16 రెట్లు పెరిగినట్లుగా తెలిపింది. అలాగే కేకులు, డెజర్ట్‌లకు మంచి గిరాకీ లభించింది. దాదాపుగా అన్ని ఆన్‌లైన్ మార్కెట్లు కూడా ఇదే రీతిలో పుల్‌సేల్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Lalit Modi: వాలంటైన్స్ డే రోజున మరో కొత్త ప్రేయసిని పరిచయం చేసిన లలిత్ మోడీ