బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? బ్యాంక్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తు్న్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్‌తో సహా వివిధ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 146 పోస్టులను భర్తీచేయనున్నారు. డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ (DDBA) 1 పోస్టు ఉన్నాయి.
Also Read:Yogi Adityanath: ‘‘మసీదుల్ని స్వాధీనం చేసుకుని బీజేపీ ఏం చేస్తుంది’’.. యోగి సమాధానం ఇదే..
ప్రైవేట్ బ్యాంకర్ – రేడియన్స్ ప్రైవేట్ 3 పోస్టులు, గ్రూప్ హెడ్ 4 పోస్టులు, ఏరియా హెడ్ 17 పోస్టులు, సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, 101 పోస్టులు, వెల్త్ స్ట్రాటజిస్ట్ (ఇన్వెస్ట్‌మెంట్ & ఇన్సూరెన్స్) 18 పోస్టులు, ప్రొడక్ట్ హెడ్ – ప్రైవేట్ బ్యాంకింగ్ 1 పోస్ట్, పోర్ట్‌ఫోలియో రీసెర్చ్ అనలిస్ట్ 1 పోస్ట్ భర్తీకానున్నాయి.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు డిగ్రీ, పీజీతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
Also Read:Vivo T4 5G: అతి త్వరలో అబ్బురపరిచే ఫీచర్స్తో సరికొత్త స్మార్ట్ ఫోన్ను తీసుకరానున్న వివో
అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 22 నుంచి 50ఏళ్లు కలిగి ఉండాలి. రిజర్డ్వ్ కేటాగిరి వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి. ఈ పోస్టులకు షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్, EWS, OBC అభ్యర్థులు రూ. 600 చెల్లించాలి. SC, ST, PWD, మహిళా అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 15 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.