NTV Telugu Site icon

ONGC Recruitment : రాత పరీక్ష లేకుండా 262 పోస్టులను భర్తీ.. భారీగా జీతాలు..

Ongc

Ongc

Oil & Natural Gas Corporation Limited (ONGC) : ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) దేశవ్యాప్తంగా ఉన్న తన కార్యాలయాల్లో ఆన్-కాల్ ఫిజీషియన్, ఎమర్జెన్సీ ఫిజీషియన్, ఫిజీషియన్, సర్జన్, హోమియోపతిక్ ఫిజీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 262 పోస్టులు భర్తీ చేయబడతాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ongcindia.com ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ జూన్ 23. మీరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే.. ఒకసారి జాబితా చేయబడిన విషయాలను జాగ్రత్తగా చదవండి.

Actor Suriya: కళ్లకురిచి ఘటనపై స్పందించిన నటుడు సూర్య.. స్టాలిన్ ప్రభుత్వంపై ఫైర్..

ఇక ఈ నోటిఫికేషన్ లో పోస్టుల వివరాలు చూస్తే.. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్, హోమియోపతి డాక్టర్, సర్జన్, ఫిజీషియన్ లను భర్తీ చేయనున్నారు. ఇక ఈ పోస్టుల కొరకు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ డిగ్రీ కలిగి ఉండాలి. ఇక హోమియోపతి డాక్టర్ ఉద్యోగానికి బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BHMS) డిగ్రీ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సర్జన్ ఉద్యోగానికి MS (జనరల్ సర్జరీ) డిగ్రీని కలిగి ఉండాలి. ఫిజీషియన్ ఉద్యోగానికి MD (జనరల్ మెడిసిన్) డిగ్రీని కలిగి ఉండాలి.

Estrogen Hormone on Ladies : మహిళలపై ఈస్ట్రోజెన్ హార్మోన్స్ ఎలా ప్రభావితం చేస్తుందంటే..

ఇక ఈ ఉద్యోగాలకి అభ్యర్థులు మెరిట్ అసెస్మెంట్, అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ కోసం షార్ట్‌ లిస్టింగ్ 1:10 నిష్పత్తిలో ఉంటుంది.