NTV Telugu Site icon

Gas leakage: ఓఎన్జీసీ గ్యాస్‌ పైప్‌ లైన్‌ లీక్.. ఉదయం నుంచి ఉద్ధృతంగా ఎగిసిపడుతోన్న మంటలు..

Gas Leakage

Gas Leakage

Gas leakage: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడులో ఓఎన్జీసీ పైప్‌ లైన్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అవుతుండడంతో.. మంటలు చెలరేగాయి.. ఉదయం నుంచి మంటలు అదుపులోకి రావడం లేదు.. శివకోడు గ్రామం మట్టపర్రు రోడ్‌లో ఇంకా గ్యాస్‌ మంటలు కొనసాగుతూనే ఉన్నాయి.. 30 అడుగుల ఎత్తులో మంటలు ఎగసిపడుతున్నాయి.. దీంతో, లోకల్ పోలీసులు, ఫైర్ సిబ్బంది, ONGC అధికారులు అప్రమత్తం అయ్యారు.. కానీ, మంటలు వచ్చే ప్రాంతంలో ఎటువంటి ONGC పైప్ లైన్లు లేవని.. సహజంగానే మంటలు ఎగసిపడుతున్నాయని అంటున్నారు ONGC సిబ్బంది. మరోవైపు.. గతంలో ఈ పొలాల వెంట ONGC పైపులైన్ వేశారని.. రెండు మూడు సార్లు నా పొలంలో గ్యాస్ లీక్ అయితే.. నష్ట పరిహారం కూడా ఇచ్చారని శ్రీనివాసరావు అనే రైతు చెబుతున్నారు.. కాగా, పైపులైన్లు లేవని ONGC అధికారులు అంటుంటే.. 20 సంవత్సరాల క్రితం ఇటువైపు ONGC పైప్‌లైన్‌ వేశారని రైతులు చెబుతున్నారు.. మరోవైపు.. మంటలను అదుపు చేయడానికి నర్సాపురం నుండి ప్రత్యేక బృందం వస్తుందని కొద్ది గంటల్లోనే మంటలను అదుపు చేస్తామని ONGC అధికారులు చెబుతున్నారు.. అయితే, ONGC గాస్ పైప్‌లైన్‌ లీక్‌ వల్లే మంటలు వస్తున్నాయా? లేక సహజంగా వస్తున్న గ్యాస్ ఫైరా అనేది తేలాల్సి ఉంది.

Read Also: MLC Varudu Kalyani: చంద్రబాబు పెట్టేది మహిళా శక్తి కాదు మాయా శక్తి..