భారతీయ మార్కెట్‌లోకి వన్‌ప్లస్ సంస్థ తన కొత్త స్మార్ట్‌ఫోన్ ‘OnePlus N6 Lite’ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం ఈ ఫోన్ సెప్టెంబర్ 22న భారత్‌లో లాంచ్ కానుంది. వన్‌ప్లస్ ఎన్ సిరీస్‌లో అత్యంత తక్కువ ధరలో లభించే ఫోన్‌గా ఇది రానుందని, దీని ధర రూ. 20,000 లోపు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ‘Midnight Hype’ అండ్ ‘Neo Green’ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. అమెజాన్, వన్‌ప్లస్ ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్, కొన్ని సెలెక్టెడ్ ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ ప్రధాన హైలైట్ ఇందులో ఉన్న భారీ 7000mAh బ్యాటరీ. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంలో ఈ బ్యాటరీ మూడు రోజుల వరకు వస్తుందని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా, ఈ ఫోన్ ద్వారా రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. దీని సహాయంతో TWS ఇయర్‌బడ్స్ లేదా ఇతర చిన్న డివైజెస్‌ను అవసరమైనప్పుడు ఛార్జ్ చేసుకోవచ్చు.
డిస్ప్లే విషయానికి వస్తే.. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.75 అంగుళాల పెద్ద ఫ్లాట్ స్క్రీన్ అందించబడింది. చేతులు తడిగా ఉన్నప్పుడు లేదా వర్షంలోనూ ఫోన్‌ను సులభంగా వాడేందుకు వీలుగా ఇందులో ‘అక్వా టచ్’ ఫీచర్ కూడా చేర్చారు.
మన్నిక పరంగా ఇది MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీని కలిగి ఉంది. 8.95mm మందం, సుమారు 215 గ్రాముల బరువుతో ఈ ఫోన్ రూపుదిద్దుకుంది. ఫోటోగ్రఫీ, యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఇందులో AI క్లియర్ ఫేస్, AI ఇరేజర్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీట్లు కూడా అందించబడ్డాయి. లాంచ్ రోజున దీనికి సంబంధించిన పూర్తి ధర, ఆఫర్ల వివరాలు అధికారికంగా వెల్లడవుతాయి.

