New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..

Oneplus 13s

Oneplus 13s

స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ప్రధాన సమస్య బ్యాటరీ త్వరగా అయిపోవడం. మనం బయటికి వెళ్లినప్పుడు ఫోన్ చార్జింగ్ త్వరగా అయిపోతే పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఈ సమస్యకు చెక్ పెట్టేలా ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ సరికొత్తగా తీసుకువచ్చిన వన్‌ప్లస్ 16 5జీ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ ఫోన్ చైనా మార్కెట్లో లాంచ్ అయి సంచలనం సృష్టిస్తుండగా, భారత్‌లో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బ్యాటరీ సమస్యతో తరచూ ఇబ్బంది పడేవారికి ఈ ఫోన్ ఒక అద్భుతమైన పరిష్కారమనే చెప్పవచ్చు. ఇందులో ఏకంగా 9000 ఎంఏహెచ్ సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ ఫోన్ సాధారణ వినియోగానికి చాలా రోజులు వస్తుంది. దీనివల్ల పదే పదే ఛార్జ్ పెట్టాల్సిన టెన్షన్ ఉండదు. ఒకవేళ బ్యాటరీ తక్కువైనా, దీన్ని క్షణాల్లో ఛార్జ్ చేయడానికి 100 వాట్ల ఫాస్ట్ ఛార్జర్ మరియు 50 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది.

కేవలం బ్యాటరీ మాత్రమే కాకుండా.. ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 185 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇవన్నీ అద్భుతమైన వ్యూవింగ్ అనుభూతిని ఇస్తాయి. అలాగే ఫోన్ వేగంగా పనిచేయడానికి శక్తివంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను జోడించారు. ఇక కెమెరా ప్రియుల కోసం వెనుకవైపు 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 120 ఎక్స్ జూమ్ సపోర్ట్ ఇచ్చారు. ఈ అన్ని అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త మొబైల్ కోసం భారత్ మార్కెట్లో అంచనాలు భారీగా ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.