Site icon NTV Telugu

OnePlus 15: ఐఫోన్ 17 సిరీస్‌కు పోటీ.. ‘వన్‌ప్లస్‌ 15’ ఫీచర్స్‌ లీక్! సూపర్ డిజైన్, బిగ్ బ్యాటరీ

Oneplus 15 Leak Features

Oneplus 15 Leak Features

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్‌’కు భారతదేశంలో మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ దృష్టా వసరుసగా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ఐఫోన్ 17 సిరీస్‌కు పోటీగా వన్‌ప్లస్‌ 15ను రిలీజ్ చేసేందుకు కంపెనీ సిద్దమైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో చైనాలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్‌ తాజాగా లీక్‌ అయ్యాయి. ఈ ఫోన్ డిజైన్ అద్భుతంగా ఉంది. లీకైన కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

వన్‌ప్లస్‌ 15 ఫోన్ 6.78 ఇంచెస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 165 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దాంతో ఈఫోన్ స్క్రీన్ చాలా స్మూత్‌గా ఉండనుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 2 ప్రాసెసర్‌తో రానుండగా.. ఇది గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు ఉపదయోగకరంగా ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో కొత్త కెమెరా మాడ్యూల్ ఇవ్వబడింది. ఇందులో రెండు కెమెరాలు పైన, క్రింద పొడవైన పిల్ ఆకారపు స్లాట్‌లో మరొకటి ఉంది. మొత్తంగా మూడు కెమెరాలు ఉన్నాయి. అలానే ఎల్‌ఈడీ ఫ్లాష్ క్రింద ఇవ్వబడింది.

Also Read: Non Poisonous Snakes: ఇవి పేరుకు మాత్రమే పాములు.. కాటు వేసినా ఏమీకాదు! పంట దిగుబడికి హెల్ప్

50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను వన్‌ప్లస్‌ 15 కలిగి ఉంటుంది. ఇది సుదూర వస్తువులను కూడా స్పష్టంగా ఫోటో తీయగలదు. కెమెరాలో కొత్త డీటెయిల్ మాక్స్ అందించనున్నారు. ఇది ఫోటో క్లారిటీని మరింత మెరుగుపరుస్తుంది. ఈ ఫోన్ నలుపు, టైటానియం, ఊదా రంగుల్లో అందుబాటులో ఉండనున్నాయి. టైటానియం మోడల్ బరువు 211 గ్రాములు కాగా.. మిగిలినది 215 గ్రాములు ఉండవచ్చు. ఈ ఫోన్ 7000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇది 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. వన్‌ప్లస్‌ 15 వచ్చే అక్టోబర్‌లో చైనాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరిలో మంద దగ్గర అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

Exit mobile version