NTV Telugu Site icon

OnePlus 12 Price Drop: అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్ 12పై 12 వేల తగ్గింపు!

Oneplus 12 Price Drop

Oneplus 12 Price Drop

టెక్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వన్‌ప్లస్ 13’ స్మార్ట్‌ఫోన్ వచ్చే నెలలో లాంచ్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్ సహా భారతదేశంలో కూడా ఒకేరోజు రిలీజ్ కానుంది. వన్‌ప్లస్ 13 లాంచ్ నేపథ్యంలో వన్‌ప్లస్‌ 12 ధరను కంపెనీ తగ్గించింది. ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌లో ఈ మొబైల్‌పై 8 శాతం రాయితీ అందిస్తోంది. అంతేకాదు ఎంపిక చేసిన కార్డు ద్వారా రూ.7 వేలు తగ్గింపు పొందవచ్చు. వన్‌ప్లస్ 12పై ఉన్న ఆఫర్స్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.

వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ 12జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.64,999గా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం అమెజాన్‌లో 8 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. అంటే రూ.5 వేలు తగ్గింపుతో రూ.59,999కే కొనుగోలు చేయొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌, వన్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే.. రూ.7 వేల ఫ్లాట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. అన్ని ఆఫర్లు కలుపుకుంటే వన్‌ప్లస్‌ 12పై 12 వేల తగ్గింపును పొందవచ్చు. మొత్తంగా మోస్ట్ పాపులర్ వన్‌ప్లస్‌ 12ను రూ.52,999కే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. అమెజాన్‌ కంపెనీ ఈఎంఐ ( 3, 6, 9 నెలల పాటు ఈఎంఐ ఆప్షన్లు) సదుపాయంను కూడా అందుబాటులో ఉంచింది.

Also Read: IND VS AUS: ఓపెనర్‌గా రోహిత్ శర్మ.. 3 పరుగులకే ఔట్‌! ఆసీస్‌ స్కోరు 474/10

వన్‌ప్లస్‌ 12 స్పెసిఫికేషన్స్:
# 6.82 ఇంచెస్ క్వాడ్‌ హెచ్‌డీ + ఎల్‌టీపీఓ 4.0 అమోలెడ్‌ డిస్‌ప్లే
# 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4,500 పీక్‌ బ్రైట్‌ నెట్
# క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8జెన్‌ 3 ప్రాసెసర్‌
# ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌ 14
# 50 ఎంపీ మెయిన్, 48 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌, 64 ఎంపీ పెరిస్కోప్‌ టెలిఫొటో జూమ్‌ లెన్స్‌
# 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
# 5,400 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ (100W సూపర్‌వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌)