Site icon NTV Telugu

Crime News: దారుణం.. మద్యం మత్తులో ఉన్న బావను కిరాతకంగా హత్య చేసిన బావమరది

Crime

Crime

Crime News: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి మండలం పందిరిమామిడి కోటలో దారుణ హత్య చోటుచేసుకుంది. పందిరిమామిడి కోటలో ఓ గిరిజనుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. గిరిజన సాంప్రదాయ మామిడికొత్త పండుగలో హత్యకు పథకం పన్నిన బావమరిది శంభు రెడ్డి.. మద్యం మత్తులో ఒంటరిగా ఇంటి వద్ద ఉన్న చితుకు రెడ్డిని దారుణంగా హత్య చేశాడు. మద్యం మత్తులో ఉన్న చితుకు రెడ్డిని మెడపై బలంగా కత్తితో నరికివేశాడని పోలీసులు వెల్లడించారు. రక్తపు మడుగులో మృతి చెందిన చితుకు రెడ్డిని చూసి గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. భూతగాదాలు కారణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Read Also: Kerala Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 14 మందికి గాయాలు!

Exit mobile version