NTV Telugu Site icon

Principal Ravindra Reddy : నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రవీంద్రా రెడ్డిపై మరో కేసు

Pricpal Ravindar

Pricpal Ravindar

విజయవాడ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రవీంద్రా రెడ్డిపై మరోదడ8ఎ కేసు నమోదు చేశారు పోలీసులు. 2019లో ఇక్కడ నర్సింగ్ విద్య చదివిన విద్యార్థినిపై అత్యాచారం చేసినట్లు ఓ విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో రవీంద్ర రెడ్డిపై మరో కేసు నమోదైంది. తాను చదువుకునే రోజుల్లో పేరెంట్స్ ఫోన్ చేసారంటూ ప్రిన్సిపాల్ రూమ్‌కు పిలిచి పలుమార్లు అత్యాచారం చేసినట్లు యువతీ ఫిర్యాదులో పేర్కొంది. 2017 నుండి 2018 వరకు నవోదయ పారా మెడికల్‌లో జీఎన్ఎం నర్సింగ్ చేసింది బాధిత యువతి.

Also Read : Mumbai Crime: ముక్కలుగా నరికి.. కుక్కర్లో ఉడకబెట్టి.. కుక్కలకేశాడు

అయితే, ఎవరికైనా విషయం చెప్తే చదువు మధ్యలోనే ఆగిపోతుందని, ఆపై సర్టిఫికెట్స్ ఇవ్వనంటూ భయపెట్టి ఆత్యాచారానికి ఒడిగట్టినట్లు ఫిర్యాదులో పేర్కొంది బాధిత యువతి. ఆరోగ్య సమస్యల రీత్యా ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నట్లు యువతి తెలిపింది. మీడియా కథనాల ఆధారంగా ఇంకా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుసుకున్న యువతి.. తన బంధువుల సహకారంతో వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో బాధిత యువతి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశారు పోలీసులు.

Also Read : North America: కార్చిచ్చుతో 100 మిలియన్ల మంది ప్రజలకు ఆరోగ్య సమస్యలు