Stampede In Cuttack: జాతరలో తొక్కిసలాట.. ఒకరు మృతి, 20 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stampede In Cuttack: ఒడిశాలోని కటక్ జిల్లాలో శనివారం జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారని, వారిలో నలుగురి పరిస్థితి తీవ్రంగా ఉందని పోలీసులు తెలిపారు. మకరమేళా సందర్భంగా బదాంబ-గోపీనాథ్‌పూర్ టి-బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడడంతో ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో 45 ఏళ్ల అంజనా స్వైన్ అనే మహిళ మరణించిందని, తీవ్రంగా గాయపడిన నలుగురిని కటక్ నగరంలోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారని బదాంబ-నర్సింగ్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దేబి ప్రసాద్ మిశ్రా ధ్రువీకరించారు.
గాయపడిన ఇతర వ్యక్తులను బాదంబాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో చేర్చినట్లు మిశ్రా తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేస్తూ, మృతురాలి కుటుంబసభ్యులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి ఉచిత చికిత్స అందుతుందని, వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. మకర సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన జాతరను, సింహనాథుని దర్శించుకునేందుకు మధ్యాహ్నం వేళ మహిళలు, చిన్నారులతో సహా భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ఈ ఘటన చోటుచేసుకుందని అతఘర్ సబ్ కలెక్టర్ హేమంత కుమార్ స్వైన్ తెలిపారు.
Also Read
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
Viral Video: దేశ రాజధానిలో దారుణం.. కారుతో ఢీకొట్టి.. అర కిలోమీటరు లాక్కెళ్లి..
కొవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ప్రజలు ఆలయాన్ని సందర్శిస్తున్నందున భక్తుల తాకిడి భారీగా ఉందని జిల్లా యంత్రాంగం తెలిపింది. కటక్, ఖోర్ధా, పూరీ, అంగుల్, దెంకనల్, బౌధ్, నయాగఢ్ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు.
తాజావార్తలు
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..