NTV Telugu Site icon

Hyderabad: హైదరాబాద్ లో ఉగ్రమూలాలు.. ఐసిస్ ఉగ్రవాది రిజ్వాన్ అలీకి షెల్టర్ ఇచ్చింది ఎవరు?

Hyderabad

Hyderabad

దేశంలో ఎక్క ఉగ్రవాద దాడులు జరిగినా దాని మూలాలు హైదరాబాద్ తో ముడిపడి ఉంటున్నాయి. హైదరాబాద్ లో మరోసారి ఉగ్రవాద మూలాలు బయటపడ్డాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ కు చెందిన ఉగ్రవాది రిజ్వాన్ అలీని ఢిల్లీ స్పేషల్ సెల్ పోలీసులు ఫరిదాబాద్ సరిహద్దులో ఎన్ఐఏ అరెస్ట్ చేశారు. న్యాయస్థానం అనుమతితో కస్టడిలోకి తీసుకున్న పోలీసులకు విచారణ చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిజ్వాన్ అలీ యువతను ఉగ్రవాదంవైపు మళ్లించడంలో దిట్ట. సుమారు ఏడాది కాలంగా పరారీలో ఉన్న ఇతడిపై ఎన్ఐఏ రూ. 3 లక్షల రివార్డు ప్రకటించింది. రిజ్వాన్ కేరళతో పాటు హైదరాబాద్ లోనూ తలదాచుకున్నట్లు విచారణలో తేలింది. నగరానికి చెందిన ఘోరీతో రిజ్వాన్ నిత్యం సంప్రదింపులు జరిపినట్లు తేటతెల్లమైంది. రాష్ట్ర నిఘా విభాగానికి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ నుంచి ఓ ప్రత్యేక బృందం హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లింది.

READ MORE: Champai Soren: బీజేపీలో చేరికపై జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ ఏమన్నారంటే..!

రిజ్వాన్ అలీ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 2015-2016 మధ్య ఆన్లైన్ నుంచి ఉగ్రవాద ప్రేరణ పొంది ఐసిస్ బాటపట్టాడు. ఝార్ఖండ్ నుంచి ఢిల్లీ వచ్చి.. షహీన్ బాగ్ కు చెందిన షాన్వాజ్ తో 2017లో పరిచయం పెంచుకున్నాడు. అతడి ద్వారా రిజ్వాన్ అలీ ఉగ్ర కార్యకలాపాలను ప్రారంభించాడు. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరఖండ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఐసిస్ మాడ్యూల్ విస్తరణతో పాటు… నిధుల సేకరణకు పనిచేశాడు. పెద్ద సంఖ్యలో యువతను ఆన్లైన్ ద్వారా ఆకర్శించి ఉగ్రవాదం వైపు మళ్లించాడు. గతేడాది పుణె పోలీసులు షానవాజ్ మాడ్యూల్ గుట్టు రట్టు చేశారు. ఈ సందర్భంగా పలువురిని అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలతో అగ్నతంలోకి వెళ్లిపోయిన రిజ్వాన్ ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ లో తలదాచుకున్నాడు. ఇతడిని మోస్ట్ వాంటెడ్ గా గుర్తించిన ఎన్ఐఏ..రూ. మూడు లక్షల రివార్డు ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో రిజ్వాన్ కదలికలు గుర్తించిన ఢిల్లీ స్పేషల్ సెల్ పోలీసలు.. సంభాల్ లోని ఓ స్థావరంపై దాడి చేశారు. అప్పట్లో తృటిలో తప్పించుకున్న అతడు.. హైదరాబాద్ కు చేరుకున్నాడు. మారు పేరుతో సికింద్రాబాద్ లో దాదాపు ఆరు నెలలు ఉన్నాడు. ఇక్కడి నుంచి కేరళ వెళ్లిన రిజ్వాన్.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నాడు. ఇందుకోసమే ఢిల్లీ వెళ్లిన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.