NTV Telugu Site icon

President Tour: మరోసారి తెలంగాణకు రాష్ట్రపతి.. ఆ తేదీల్లో హైదరాబాద్ కు రాక

Rastrapathi

Rastrapathi

President Tour: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరోసారి తెలంగాణ పర్యటనకు రానుంది. ఇప్పటికే శీతాకాల విడిది కోసం ఒక్కసారి తెలంగాణకు రాగా.. మరోసారి హైదరాబాద్ పర్యటన ఖరారైంది. అప్పుడు ఐదు రోజుల పర్యటన సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు ద్రౌపది ముర్ము. తెలంగాణలోని రామప్ప ఆలయం, భద్రాచలం ఆలయాన్ని ఆమే సందర్శించారు. అనంతరం ఆలయ విశిష్టతలను అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా ఇటు ఏపీలో శ్రీశైలం దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. శ్రీమల్లిఖార్జున స్వామి వారి సేవలో పాల్గొని.. పూజలు నిర్వహించారు. అంతేకాకుండా దేవస్థాన అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.

Read Also: K Laxman: ఇచ్చిన హామీల్ని కేసీఆర్ తుంగలో తొక్కారు.. తెలంగాణని భ్రష్టు పట్టించారు

అంతేకాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది పర్యటనలో హైదరాబాద్ లో జి. నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విద్యార్థులు, అధ్యాపకులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. అప్పుడు ఆ 5 రోజుల్లో ఆమే పర్యటించిన వివరాలు అలా ఉన్నాయి. కానీ ఈసారి పర్యటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రాష్ర్టపతి పర్యటన ఎక్కడెక్కడా కొనసాగుతుంది.. ఎలాంటి కార్యక్రమాలకు హాజరవుతారన్న వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.

Read Also: Neha Sharma : బికినీలో బోల్డ్ ట్రీట్..కుర్రాళ్లు తట్టుకోగలరా..

మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 16, 17వ తేదీల్లో హైదారాబాద్‌కు రానున్న నేపథ్యంలో.. అధికారులు సమావేశం కానున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై రేపు సీఎస్‌ శాంతికుమారి అధ్యక్షతన అధికారులతో సమన్వయ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి కార్యక్రమాలు, షెడ్యూల్ విడుదల కానుంది.