NTV Telugu Site icon

Viral Video: ఓ వైపు ఎంపీ సీరియస్ గా స్పీచ్ ఇస్తుంటే.. వెనకున్న ఆరేళ్ల కుమారుడు ఏం చేస్తున్నాడో చూడండి

New Project (48)

New Project (48)

US హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో జరిగిన ఓ సంఘటన వైరల్ గా మారింది. ఇంటర్నెట్‌లో చాలా మంది హృదయాలను గెలుచుకుంది. ఇటీవల, US కాంగ్రెస్ సభ్యుడు, టేనస్సీ ప్రతినిధి జాన్ రోస్ సీరియస్ గా ప్రసంగిస్తున్నారు. వెనకున్న అతని 6 ఏళ్ల కుమారుడు చేసిన పనికి చాలా మంది నవ్వుకున్నారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాస్తవానికి.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి నేరారోపణలకు వ్యతిరేకంగా రోజ్ మాట్లాడుతున్నారు.

READ MORE: Palnadu: పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో పల్నాడులో టెన్షన్

ఎక్స్‌లో అప్‌లోడ్ చేసిన వీడియో చేసే వరకు వెనక తన కొడుకు కెమెరాకు వినోదం పంచుతున్నాడని ఆయనకు తెలియలేదు. జాన్ రోస్ స్వీచ్ ఇస్తున్నప్పుడు కుమారుడైన గైని కెమెరాను చూసి నవ్వడం ప్రారంభించాడు. ఆపై తన నాలుకను చాపడం ద్వారా వింత వంకర ముఖాలను ప్రదర్శించాడు. తన కళ్ళు తిప్పడం వీడియోలో చూడొచ్చు. చివరికి బాలుడు తన చేష్టలతో విసిగిపోయి.. మెత్తని బొమ్మతో ఆడుకోవడం ప్రారంభించాడు.

జాన్ రోస్ ఈ వీడియోను షేర్ చేశారు. “ఇది నా కొడుకు గైని తన తమ్ముడిని నవ్వించడం కోసం చేసింది ” అని క్యాప్షన్ ఉంది. ఆ పిల్లాడి ఆటతీరు చాలా మంది ముఖాల్లో చిరునవ్వు తెప్పించింది. ఈ వీడియో చూసిన తర్వాత జాన్ రోజ్ స్వయంగా నవ్వి ఉంటారు. ఈ వీడియో సోషల్ మీడియాలో త్వరగా ప్రజాదరణ పొందింది. గై అమాయకత్వంపై వినియోగదారులు చాలా ప్రేమను కురిపించారు. ఈ వీడియో 6 లక్షల 50 వేల కంటే ఎక్కువ మంది వీక్షించారు. వీక్షణల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. చాలా మంది పిల్లవాడిని చాలా క్యూట్ అని కామెంట్స్ చేశారు. అలాగే కొందరు అతని హాస్యాన్ని మెచ్చుకున్నారు.