Kalki 2898 AD: కల్కి సినిమాపై సూపర్ స్టార్ ప్రశంసల వర్షం..

  • సూపర్ స్టార్ రజినీకాంత్ ట్విట్టర్ వేదికగా కల్కి సినిమా గురించి.
  • దర్శకుడు నాగ్ అశ్విన్ భారతీయ సినిమాలను మరో స్థాయికి తీసుకెళ్లడంటూ అతనిపై ప్రశంసలు.
  • కల్కి బృందం తీసే పార్ట్ 2 కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ తెలిపాడు.
Rajini Kalki

Rajini Kalki

Kalki 2898 AD: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కల్కి సినిమా మానియా ఉందంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల అగ్రతారాలందరూ సినిమాలో నటించడంతో ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. ముఖ్యంగా దర్శకుడు నాగ్ అశ్విన్ రచన, దర్శకత్వం వహించిన తీరు ఇప్పుడు అందరిని ఆశ్చర్యం గురించి చేస్తుంది. సినిమాలో చూపించిన విజువల్ వండర్స్, దానిని ప్రజెంట్ చేసిన విధానం అందర్నీ మెప్పిస్తుంది. ఇందుకు సంబంధించి అనేక మంది ప్రముఖులు వారి సోషల్ మీడియా ఖాతాల ద్వారా విషయాలను పంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ( Rajinikanth ) ట్విట్టర్ వేదికగా కల్కి సినిమా గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. పూర్తి వివరాలు చూస్తే..

IND vs SA: ఇండియా vs సౌతాఫ్రికా ఫైనల్ మ్యాచ్.. బార్బడోస్ పిచ్ రిపోర్ట్

తాను కల్కి సినిమాను చూశానని.. ఇది ఎంతో గొప్ప సినిమా అని., దర్శకుడు నాగ్ అశ్విన్ భారతీయ సినిమాలను మరో స్థాయికి తీసుకెళ్లడంటూ అతనిపై ప్రశంసలు కురిపించాడు. అలాగే చిత్ర నిర్మాత అశ్విని దత్ కు నా ప్రియమైన స్నేహితుడుకు హృదయపూర్వక అభినందనలు అంటూ ఆయనని ట్యాగ్ చేశారు. ఇక ఆ ట్వీట్ లోనే కమల్ హాసన్, ప్రభాస్, అమితాబచ్చన్, దీపికా పదుకొనె లాంటి వారిని ట్యాగ్ చేస్తూ కల్కి బృందం తీసే పార్ట్ 2 కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ తెలిపాడు. అందుకోసం భగవంతుడు ఆశీర్వదిస్తాడు అంటూ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Blast Incident: షాద్నగర్ పేలుడు ఘటన.. విషమంగా ముగ్గురి పరిస్థితి