NTV Telugu Site icon

Viral video: విహార యాత్రలో విషాదం.. కారు లోయలోపడి యువతి మృతి

Care

Care

స్నేహితుడితో కలిసి ఆ యువతి విహార యాత్రకు వెళ్లింది. టూరిస్టు స్థలాలను మిత్రుడితో కలిసి సందర్శించింది. ఎంతో సంతోషంగా గడిపింది. మనసులో ఏం పుట్టిందో ఏమో.. కారు నడిపే అలవాటు ఉందో లేదో తెలియదు గానీ.. డ్రైవింగ్ సీటులో కూర్చుని వెనక్కి డ్రైవ్ చేస్తోంది. ఇంకోవైపు మిత్రుడు మొబైల్‌లో రికార్డ్ చేస్తు్న్నాడు. అంతే ఉన్నట్టుండి ఏమైందో తెలియదు గానీ.. అమాంతంగా కారు లోయలో పడిపోయింది. కారు నుజ్జు నుజ్జు అయిపోయింది. స్పాట్‌లోనే యువతి ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలోపి శూలీభంజన్ కొండపై ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

శూలీభంజన్ కొండపై 23 ఏళ్ల శ్వేత దీపక్ అనే యువతి.. కారు రివర్స్ చేస్తుండగా వాహనంతో సహా 300 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. సోమవారం ఔరంగాబాద్ నుంచి శూలీభంజన్ కొండకు శ్వేత.. ఆమె మిత్రుడు సూరజ్ విహార యాత్రకు వెళ్లినట్టు పోలీసులు చెప్పారు. శ్వేత కారును రివర్స్ చేస్తుండగా.. సూరజ్ వీడియో రికార్డు చేస్తున్నాడని తెలిపారు. కారు వేగంగా వెనక్కి వెళ్తుండడాన్ని గమనించిన మిత్రుడు.. వెంటనే పరుగున వెళ్లి క్లచ్‌పై కాలు వేయమని శ్వేతకు సూచించాడు. కానీ అంతలోనే కారు వేగంగా దూసుకెళ్లి లోయలోపడిపోయింది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: International Yoga Day 2024: శ్రీనగర్లో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోడీ..

సందర్శకులు శూలీభంజన్ కొండ దర్శనానికి వస్తుంటారు. పర్యాటకులు దత్తాత్రేయ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. వర్షాకాలంలో శూలీభంజన్ కొండపై సుందరమైన దృశ్యాలు ఉంటాయి. దీంతో ఈ ప్రాంతాన్ని ఆస్వాదించడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడంతో సందడి సందడిగా ఉంటుంది. టూరిస్టుల కళ్ల ముందే కారు బోల్తా పడిపోయింది. యువతిని హెచ్చరించినా.. కంగారులో ఏమీ చేయలేకపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.