మంచిర్యాల: కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. అన్నారం బ్యారేజీ వలన వరద ముంపునకు గురవుతున్న సుందరశాల గ్రామ పంట భూములను వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా వివేక్‌కు తమ బాధలు చెప్పుకుంటూ సుందరశాల గ్రామ రైతులు కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో లక్ష కోట్ల ప్రజా ధనాన్ని మాజీ సీఎం కేసీఆర్ వృథా చేశారని విమర్శించారు. అవినీతి కేసీఆర్‌ను వెంటనే జైల్లో వేయాలని వివేక్ డిమాండ్ చేశారు.
Read Also: Bandi Sanjay: కరీంనగర్ నుండే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం..
తుమ్మడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్ట్‌ను కాదని కాళేశ్వరాన్ని రీ డిజైన్ చేశారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన కాంట్రాక్టర్లంతా ప్రపంచంలోనే ధనికులయ్యారని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌పైన, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన కాంట్రాక్టర్లపై ఈడీ విచారణ చేయాలని కోరారు. తనపై బాల్క సుమన్ ఒక్క ఫిర్యాదు చేయగానే ఈడీ విచారణ చేశారని గుర్తుచేశారు. తాను గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అనేక సార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వాపోయారు. నియోజకవర్గంలోని బ్యాక్ వాటర్ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తానని రైతులకు వివేక్ హామీ ఇచ్చారు.
Read Also: Bank Holidays : ఫిబ్రవరి లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసా?
