NTV Telugu Site icon

Olympics 2024: ఒలింపిక్స్ బాక్సింగ్‌ పోటీల్లో పురుషుల విభాగంలో మొదటి బెర్త్ క‌న్ఫామ్..

Boxing

Boxing

ఒలంపిక్స్ 2024 పారిస్ నగరంగా జరగబోతున్న ఈ మెగా ఈవెంట్లో భారత్ నుండి పురుషుల బాక్సింగ్ అర్హత పోటీల్లో భారతదేశానికి చెందిన నిశాంత్ దేవ్ స్థానాన్ని కన్ఫామ్ చేసుకున్నాడు. భారత యువ బాక్సర్ నిశాంత్ దేవ్ బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ అర్హత పోటీలలో క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించి ప్రతిష్టాత్మక పారిస్ ఒలంపిక్స్ బెడుతును కైవసం చేసుకున్నాడు. దీంతో ప్యారిస్ ఒలంపిక్స్ 2024 బాక్సింగ్ నుండి పురుషులలో మొదటి ఎంట్రీ నమోదయింది.

Road Accident : జర్నీ సినిమా సీన్ రిపీట్.. రెండు బస్సులు ఢీ.. ముగ్గురు మృతి, 30 మందికి గాయాలు..

శుక్రవారం రాత్రి జరిగిన పోటీలలో పురుషుల 71 కిలోల విభాగం నుండి నిశాంత్ క్వార్టర్ ఫైనల్ లో 5 – 0 తో మోల్డవ బాక్సర్ వెస్లీ సెబోటరి ను ఓడించి సెమీస్ పోరుకు దూసుకెళ్లాడు. దీంతో అతను భారత తరఫున పారిస్ ఒలంపిక్స్ సాధించిన మొదటి పురుష బాక్సర్ గా రికార్డు సృష్టించాడు.

Wines Closed: మరోమారు మందుబాబులకు డ్రైడే.. 4న మద్యం దుకాణాలు బంద్‌..

ఈ నేపథ్యంలో విశ్వ క్రీడలకు సంబంధించి మొత్తంగా అర్హత సాధించిన నాలుగో భారత బాక్సర్ గా నిశాంత్ రికార్డు సృష్టించాడు. నిశాంత్ కంటే ముందుగా ముగ్గురు మహిళ బాక్సర్లు ఒలంపిక్స్ కు అర్హతను సాధించారు. వీరిలో ఇదివరకే నిఖత్‌ జరీన్‌ (50 కిలోలు), ప్రీతి పవార్‌ (54 కిలోలు), లవ్లినా బొర్గెహెన్‌ (75 కిలోలు) లు వివిధభాగాలలో ఒలంపిక్స్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకున్నారు.

Show comments