భారత్ లాంటి దేశంలో క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు..? పిల్లల నుంచి వృద్ధుల వరకు చేతిలో బ్యాట్ పట్టేసి తెగ ఆడేస్తుంటారు. ఇకపోతే తాజాగాలండన్ కు చెందిన ఓ 66 ఏళ్ల ‘సాలీ బార్టన్’ ఓ గొప్ప సాహసం చేసింది. ముగ్గురు మనవళ్లు పుట్టిన తర్వాత కూడా క్రికెట్ అరంగేట్రం చేసి అందరిని ఔరా అనిపించింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అత్యంత వృద్ధ మహిళగా బార్టన్ రికార్డును సృష్టించింది.
TS ECET Counselling: ఈసెట్ అభ్యర్థులకు అలెర్ట్.. కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసిందోచ్..
ఎస్టోనియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో బార్టన్ జిబ్రాల్టర్ తరపున ఆడింది. ఆ సమయంలో బార్టన్ వయసు 66 ఏళ్ల 334 రోజులు. ఈ రికార్డు ఇదివరకు పోర్చుగల్ దేశానికి చెందిన అక్బర్ సయ్యద్ పేరు మీద ఉండేది. అక్బర్ 66 ఏళ్ల 12 రోజుల వయసులో క్రికెట్ అరంగేట్రం చేసి 2012లో ఈ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా 66 ఏళ్ల 334 రోజులతో సాలీ బార్టన్ ఈ రికార్డ్ ను బ్రేక్ చేసింది.
TS Engineering Counselling: ఇంజినీరింగ్ కాలేజీ ప్రవేశాల కౌన్సెలింగ్ షురూ..
ఎస్తోనియాతో జరిగిన ఈ సిరీస్ లో వికెట్ కీపర్ అయిన బార్టన్ కు బ్యాటింగ్ చేసే అవకాశం అందుకోలేకపోయింది. అంతేకాదు ఏ ఒక్కరిని కూడా ఔట్ చేయలేకపోయింది. అయినా కాని మిగతావాళ్ల విజృంభణతో గిజ్రాల్ట్ జట్టు 3 – 0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఈమె వ్యక్తిగత జీవితానికి ఓ సారి చూస్తే.. ఆవిడ ఓ మాజీ ప్రొఫెసర్. లండన్ ఎకనామిక్స్ స్కూల్లో మ్యాథమాటిక్స్ ప్రొఫెసర్ గా ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించింది. ఆపై ఇంట్లో బోర్ కొట్టడంతో క్రికెట్ బ్యాట్ ను పట్టి రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించుకుంది.