NTV Telugu Site icon

Viral Video : ఈ వయసులో కూడా తగ్గేదేలే అంటున్న బామ్మ.. నెటిజన్స్ ఫిదా..

Bamma

Bamma

ఈరోజుల్లో 30 ఏళ్ల వాళ్లే ఎక్కువ దూరం ప్రయాణించలేరు.. అలాంటిది ఓ బామ్మ టీవీఎస్ బైక్ పై 600 కిలో మీటర్లు అవహేళన ప్రయాణించి అందరిని షాక్ కు గురిచేసింది.. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వయసు శరీరానికి మాత్రమే మనసుకు కాదని ఆమె నిరూపించింది.. గతంలో ఇలాంటి వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.. ఇప్పుడు ఈ వీడియో కూడా జనాల ఆదరణ పొందుతుంది..

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ బామ్మ సరిగ్గా ఇలాంటి వ్యక్తే. కుర్రాళ్లు కూడా ఈమె ముందు బలాదూర్. 30-35 ఏళ్ల వయసుకే కొందరు బైక్‌పై గంటపాటు ప్రయాణిస్తేనే అలసిపోయామంటూ కూలబడిపోతుంటారు. కానీ, ఈ బామ్మ 66 ఏళ్ల వయసులోనూ 600 కిలోమీటర్ల దూరం మోపెడ్‌పై వెళ్లింది.. అది కూడా ఒంటరిగా వెళ్లి తిరిగి వచ్చింది.. దాంతో అందరు ఆమె ఎనర్జీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు..

ఈ వైరల్ అవుతున్న వీడియో పై కనిపిస్తున్న బామ్మ పేరు సోహాన్‌బాయి. తాను ఉండేది నీమచ్ జిల్లాలోని మాన్సా తెహ్సిల్‌లో చాలా ఏళ్లక్రితమే ఆమె భర్తతో విడిపోయింది. ఆ తరువాత పిల్లలతో పాటూ పుట్టింటికి వచ్చేసింది. నాటి నుంచి ఆమె పాలు అమ్ముతూ సొంతసంపాదనతో బిడ్డల్ని పెంచిపెద్ద చేసింది. మోపెడ్‌పై పాలు అమ్మడం ప్రారంభించిన ఆమెకు క్రమక్రమంగా డ్రైవింగ్ కొట్టినపిండి అయిపోయింది. ఎంతలా అంటే ఆమె ఇప్పుడు వందల కిలోమీటర్ల దూరం మోపెడ్‌ నడుపుకుంటూ ఒంటరిగా ప్రయాణించగలదు.. దాంతో ఆమెకు కొందరు పాదాభివందనం కూడా చేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది .ఈ వయసులో ఇంత దూరం మోపెడ్‌పై అదీ ఒంటరిగా ప్రయాణించడం మామూలు విషయం కాదంటూ అనేక మంది ఈ వృద్ధురాలిపై ప్రశంసలు కురిపించారు. వృద్ధాప్యం శరీరానికే గానీ మనసుకు కాదని ఆమె నిరూపించిందని మరొకరు కామంట్ చేశారు.. ఇలా వీడియోను చూసిన వారంతా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..మీరు బామ్మ వీడియో చూసి లైక్ వేసుకోండి..