NTV Telugu Site icon

CM KCR: కొండగట్టులో కేసీఆర్ ఫ్యామిలీ.. పాత ఫోటోలు వైరల్

Kcr

Kcr

CM KCR: జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని కొండగట్టులో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆయన గతంలో కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు వెళ్లిన పాత ఫోటోలు బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సీఎం సతీమణి శోభారాణితో పాట కుమార్తె కవిత, కుమారుడు కేటీఆర్ చిన్న పిల్లలుగా ఆడుకుంటున్న ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. కేసీఆర్‌ దాదాపు 25 క్రితం కొండగట్టుకు కుటుంబంతో కలిసి వచ్చారు. చివరిసారిగా ఆయన 1998లో కొండగట్టు ఆలయానికి వచ్చారు. అప్పటికి ఇంకా ఉద్యమ ప్రస్థానం మొదలుపెట్టలేదు. ఈ తర్వాత ఉద్యమ సమయంలో, ఎన్నికల సమయాల్లో పలుమార్లు జగిత్యాలకు వచ్చినా.. కొండగట్టు ఆలయానికి రావడం మాత్రం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. కొండగట్టుకు ఎలాంటి వరాలు ప్రకటిస్తారా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవాళ సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కొండగట్టు క్షేత్రం ఆలయం పరిసరాలను ఏరియల్‌ వ్యూ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. అంజన్న ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ పర్యటనే నేపథ్యంలో ఆయన పాత ఫోటోలు వైరల్‌ కావడం గమనార్హం. గతంలో ఆయన టీడీపీ నేతగా కొనసాగుతున్న కాలంలో కుటుంబసభ్యులతో కలిసి కొండగట్టును దర్శించుకున్నారు. అక్కడ కొండపై కుటుంబసభ్యులతో సరదాగా గడిపారు. నాడు చిన్న పిల్లలైన కేటీఆర్, కవితను వీపుపై ఎక్కించుకొని కాసేపు ఆడించారు. తాజాగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Harish Rao : బస్తీ దవాఖానాలు పేద ప్రజలకు దోస్తీ దవాఖానాలుగా మారుతున్నాయి

గత డిసెంబర్ 7న జగిత్యాల జిల్లా మోతెలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని.. కొండగట్టు, ధర్మపురి, వేములవాడ రాజన్న ఆలయాల అభివృద్ధి గురించి ప్రస్తావించారు. ఈ ఆలయాల అభివృద్ధి కోసం చేపట్టబోయే ప్రణాళికలను గురించి కూడా ప్రస్తావించారు. ఆంజనేయ స్వామి ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని, గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఆలయ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రకటన అనంతరం ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి కొండగట్టు క్షేత్రానికి వచ్చి పరిశీలించారు. యాదాద్రి నూతన ఆలయ నమూనాను ఈయనే రూపొందించారు. ఆగమ శాస్త్ర పండితులు, స్థపతుల అభిప్రాయాలను కూడా తీసుకొని, కొండగట్టును సమూలంగా అభివృద్ధి చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.

సీఎం కేసీఆర్‌ నేడు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రంలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్‌.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కొండగట్టుకు చేరుకున్నారు. అయితే.. 25 ఏళ్ల తరువాత తొలిసారి సీఎం హోదాలో కొండగట్టు అంజన్న క్షేత్రానికి సీఎం కేసీఆర్‌ విచ్చేశారు. అయితే.. కొండగట్టుకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ సీఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. కొండగట్టు ఆలయంలోకి ప్రవేశించిన సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.