Site icon NTV Telugu

Indra Re Release: ‘అయ్యయ్యయ్యో’ పాటకు పెద్దాయన సూపర్ డాన్స్.. ‘బాస్’ని 100 శాతం మ్యాచ్ చేశాడు!

Indra Re Release

Indra Re Release

‘మెగాస్టార్‌’ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 22 ఏళ్ల క్రితం విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఇంద్ర’ చిత్రం నేడు రీ-రిలీజ్ అయింది. చిత్ర నిర్మాణసంస్థ వైజయంతి మూవీస్‌.. తెలుగు రాష్ట్రాల్లోని 385 థియేటర్లలో రీ రిలీజ్‌ చేసింది. థియేటర్లలో మరోసారి ‘ఇంద్ర సేనా రెడ్డి’ని చూసి ఫాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. థియేటర్లలో అభిమానులు భారీ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు. డాన్సులు, కేకలు, ఈలలు వేస్తూ సందడి చేస్తున్నారు. ఇందుకు సంబందించిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ గొప్ప నటుడు.. సినిమాల్లోకి మాత్రం రావొద్దు!

ఇంద్ర రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్లో ఓ పెద్దాయన డాన్స్ ఇరగదీశాడు. తోటి ప్రేక్షకులతో కలిసి ‘అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో’ పాటకు అదిరే స్టెప్పులు వేశాడు. ఆ పెద్దాయన డాన్స్ చూసి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్‌ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఆ పెద్దాయనతో తాను కలిసి ఇంద్ర సినిమా చూశానని, ఆయనకు చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని చెప్పాడని పేర్కొన్నాడు. అతడితో కలిసి సినిమా చూడడం తన అదృష్టం అని చెప్పాడు. ముసలోడే కానీ మహానుభావుడు’ అనే టాగ్ అతడికి ఇవ్వాలన్నాడు. ‘బాస్’ని 100 శాతం మ్యాచ్ చేశాడు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది

Exit mobile version