NTV Telugu Site icon

Old City Metro : పాతబస్తీలో మెట్రో… సన్నాహక పనులను ప్రారంభించిన హెచ్‌ఎంఆర్‌ఎల్

Hyderabad Metro

Hyderabad Metro

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు పాతబస్తీలో మెట్రో రైలు పనులు చేపట్టేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్ సన్నాహక పనులను ప్రారంభించింది. పాత నగరంలో 5.5కి.మీ బ్యాలెన్స్ మెట్రో అలైన్‌మెంట్ MGBS నుండి దారుల్షిఫా జంక్షన్ – పురానీ హవేలీ – ఇత్తెబార్ చౌక్ – అలీజాకోట్ల – మీర్ మోమిన్ దైరా – హరిబౌలి – శాలిబండ – శంషీర్‌గంజ్ మరియు అలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు ఉంటుంది. ఈ మెట్రో రైల్ మార్గం లో 5 స్టేషన్లు – సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్‌గంజ్ మరియు ఫలక్‌నుమా ఉంటాయి. మెట్రో స్టేషన్లు సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్‌లకు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ఈ రెండు స్టేషన్‌లకు నగరంలో ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా వాటి పేరు పెట్టడం జరిగిందని HMRL MD NVS రెడ్డి తెలిపారు.

Also Read : IND W vs BAN W: బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా వరుసగా రెండోసారి ఓటమి..

21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ఖానాలు, 33 దర్గాలు, 7 స్మశానవాటికలు & 6 చిల్లాలతో సహా మొత్తం 103 మతపరమైన మరియు ఇతర సున్నితమైన నిర్మాణాలు ఈ మెట్రో రైల్ మార్గం లో ఉన్నాయి. కర్వేచర్ సర్దుబాటు, వయాడక్ట్ డిజైన్ మరియు ఎత్తులు, మెట్రో పిల్లర్ లొకేషన్‌లలో తగిన మార్పు మొదలైన ఇంజనీరింగ్ పరిష్కారాల ద్వారా, నాలుగు తప్ప మిగిలిన అన్ని మతపరమైన/సున్నితమైన నిర్మాణాలు పరిరక్షించబడ్డాయి. సీఎం, MA & UD మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మిగిలిన నాలుగు మతపరమైన నిర్మాణాలను కూడా కాపాడేందుకు మెట్రో అలైన్‌మెంట్‌కు ఇంజినీరింగ్ పరిష్కారాలు జరుగుతున్నాయి. మతపరమైన/సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు, రోడ్డు విస్తరణ 80 అడుగులకు పరిమితం చేయబడుతుంది. కానీ నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ నుండి పాఠాలు నేర్చుకోవడం ద్వారా స్టేషన్ స్థానాల్లో మాత్రం రహదారిని 120 అడుగులకు విస్తరించడం జరుగుతుంది. విస్తరణలో ఎఫెక్ట్ అయ్యే దాదాపు 1000 ఆస్తుల వ్యక్తిగత స్కెచ్‌ల తయారీ ప్రారంభించబడిందని, ఒక నెలరోజుల లో భూ సేకరణ నోటీసులు జారీ చేయబడతాయ NVS రెడ్డి తెలిపారు.

Also Read : NDA Alliance: జులై 18న ఎన్డీయే సమావేశం.. దర్శనమివ్వనున్న బీజేపీతో కలిసి పనిచేసే పార్టీలు