ప్రముఖ ఓలా క్యాబ్స్ కంపెనీ మరో సరికొత్త ప్రీమియం సర్వీస్.. ప్రైమ్ ప్లస్ అనే పేరుతో ప్రారంభించింది. ఈ సర్వీసుతో ఎలాంటి క్యాన్సిలేషన్ రద్దు లేదా కార్యకలాపాల సమస్యలు లేకుండా వస్తుందని ఆ కంపెనీ వెల్లడించింది. ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ఈ కొత్త ప్లాన్ ను ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. బెంగుళూరులో ఎంపిక చేసిన యూజర్లకు ఈ సర్వీసు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. తర్వలో ఇతర నగరాలకు విస్తరిస్తుందని ఆయన తెలిపారు. ఓలా తమ కస్టమర్‌లకు ఎలాంటి అంతరాయం లేకుండా సత్వర ప్రయాణాన్ని అందించేందుకు ఈ సరికొత్త ప్రీమియం ‘ప్రైమ్ ప్లస్’ సర్వీస్ ను ప్రారంభించినట్టు భవిష్ పేర్కొన్నారు. బెంగళూరులో పూర్తి స్థాయిలో ప్రైమ్ ప్లస్ సర్వీసును స్టార్ట్ చేసినట్లు అగర్వాల్ పేర్కొన్నారు. ఇటీవలే పైలట్ ప్రోగ్రామ్ సక్సెస్ కావడంతో ఓలా ఈ దిశగా అడుగులు వేసింది.
Read Also: Pothula Sunitha Strong Warning: పవన్‌కు ఇదే మా వార్నింగ్.. మేం చాటలు, చెXX. ఎత్తితే నీ గతేంటి..?
అయితే.. ప్రైమ్ ప్లస్ సర్వీసు ద్వారా ఓలా ప్రొఫెషనల్ డ్రైవర్లతో అసాధారణమైన ప్రయాణాన్ని అందించనుందని ఆ కంపెనీ సీఈవో తెలిపారు. రైడ్ కాన్సలేషన్స్, కార్యాచరణ ఇబ్బందులను తొలగించనుంది.. ఇవాళ్టి ( సోమవారం) నుంచి బెంగళూరు వ్యాప్తంగా ప్రైమ్ ప్లస్ సర్వీసు కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ నెలలో మరిన్ని నగరాల్లో ప్రైమ్ ప్లస్ సర్వీసును మరింత విస్తరించనుందని ఓలా భావిస్తోంది. బెంగుళూరులో ప్రైమ్ ప్లస్ పైలట్ అద్భుతమైన విజయాన్ని సాధించగా.. వినియోగదారులకు మరింత ఆకట్టుకునేలా సర్వీసులను విస్తరించాలని కంపెనీ అనుకుంటుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఓలా తమ సర్వీసులను మెరుగుపరుస్తుందని ఓలా ప్రతినిధి తెలిపారు. 2011లో ఓలా క్యాబ్స్ సర్వీసులను స్టార్ట్ చేసి.. ప్రపంచంలోని కొన్ని లాభదాయకమైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది.
Read Also: Nani : తన తరువాత సినిమా పై అప్డేట్ ఇచ్చిన నాని..
దేశీయ మార్కెట్లో మాత్రమే కాదు.. 200 నగరాల్లో తమ కార్యకలాపాలు.. ఒక మిలియన్ కన్నా ఎక్కువ మంది డ్రైవర్లతో దేశంలోనే అతిపెద్ద రైడ్-హెయిలింగ్ నెట్‌వర్క్‌ను ఓలా విస్తరించిందని భవిష్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం, ఓలా తన యాప్‌లో మినీ, ఆటో, బైక్‌తో సహా పలు సర్వీసులను అందిస్తుంది. అయితే, వినియోగదారులు నిర్దిష్ట అవసరాల కోసం ప్రైమ్ సెడాన్, ప్రైమ్ SUV, రెంటల్స్‌ను బుక్ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు.
