Site icon NTV Telugu

Ola S1 Pro Sport: ఏడీఎస్ ఫీచర్ తో మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్‌ విడుదల.. సింగిల్ ఛార్జ్ తో 320KM రేంజ్

Untitled 1

Untitled 1

ఆటోమొబైల్ మార్కెట్ లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. స్మార్ట్ ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీతో వస్తుండడంతో వాహనదారులు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా ఓలా ఎలక్ట్రిక్ తన కొత్త స్కూటర్ ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్‌ను విడుదల చేసింది. ఇది దేశంలోనే మొట్టమొదటి ADAS ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ఇతర EV స్కూటర్ల నుంచి భిన్నంగా ఉంటుంది. ఇది సెగ్మెంట్ ఫస్ట్ అత్యుత్తమ ఫీచర్లను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్ భారత్ లో రూ.1,49,999 ప్రారంభ ధరకు విడుదలైంది. రూ.999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీ జనవరి 2026లో ప్రారంభమవుతుంది.

Also Read:Trump-Putin: ట్రంప్-పుతిన్ భేటీ ఆడంబరమేనా? నిపుణులు ఏమంటున్నారంటే..!

ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్ డిజైన్ ప్రస్తుతం ఉన్న ఓలా స్కూటర్ల కంటే మరింత డైనమిక్, స్పోర్టీగా ఉంది. ఇందులో స్ట్రీట్-స్టైల్ ఫెయిరింగ్, వర్టికల్ రేసింగ్ స్ట్రిప్స్, స్ప్లిట్ గ్రాబ్ రెయిల్స్, కొత్త రియర్-వ్యూ మిర్రర్లు ఉన్నాయి. తేలికైన, బలమైన కార్బన్ ఫైబర్‌తో తయారు చేయబడిన ఫ్రంట్ ఫెండర్, గ్రాబ్ హ్యాండిల్ స్కూటర్‌ను స్టైలిష్‌గా, తేలికగా ఉండేలా చేశాయి. దీనితో పాటు, కొత్త సీట్ కవర్లు, ఫ్లోర్ మ్యాట్‌లు, బాడీ డెకాల్స్ కూడా అందించారు.

Also Read:GST Rate Cuts 2025: ఇక రెండు శ్లాబులు మాత్రమే.. జీఎస్టీ తగ్గింపుపై కేంద్రం కొత్త ప్రణాళిక

Ola S1 Pro Sport దేశంలోనే మొట్టమొదటి ADAS ఫీచర్. ఇది రియల్-టైమ్ అలర్ట్‌లను అందిస్తుంది. తద్వారా మీరు ట్రాఫిక్‌లో సురక్షితంగా ప్రయాణించవచ్చు. ఇందులో ఫ్రంట్ డాష్‌క్యామ్ కూడా ఉంది, ఇది రైడ్‌ను రికార్డ్ చేయడం, సాక్ష్యాలను సేకరించడం, బీమా క్లెయిమ్‌లు లేదా వ్లాగింగ్ చేయడంలో కూడా సహాయపడుతుంది. దీనితో పాటు, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్, ABSతో బ్రేక్-బై-వైర్, ట్రాక్షన్ కంట్రోల్, అడాప్టివ్ బూస్ట్, మోటార్ సౌండ్, నావిగేషన్ వంటి క్రేజీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also Read:Tungabhadra Dam: డేంజర్‌లో తుంగభద్రత డ్యామ్..! పనిచేయని మరో 7 గేట్లు

ఓలా S1 ప్రో స్పోర్ట్ 5.2 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. దీనిలో అమర్చిన మోటారు 16kW శక్తిని, 74Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత, ICD సర్టిఫైడ్ రేంజ్ 320 కి.మీల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. గరిష్ట వేగం గంటకు 141 కి.మీ. ఇది కేవలం 2.0 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

Exit mobile version