Ola Electric : భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ దిగ్గజం ‘ఓలా ఎలక్ట్రిక్’ దేశీయ మార్కెట్లో అడుగు పెట్టిన నాటి నుంచి అమ్మకాల్లో దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. అయితే రానున్న దీపావళి పండుగను పురస్కరించుకుని కంపెనీ మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయడాని సంకల్పిస్తోంది. రాబోయే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లకంటే కూడా తక్కువగా ఉంటుంది. ఎస్1 వేరియెంట్ కంటే తక్కువ ధరకు కొత్త స్కూటర్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ 2022 అక్టోబర్ 22 న భారీ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు. దేశంలోని ఈ-స్కూటర్ విభాగంలో దీని ధర రీజనబుల్ ప్రైస్‌గా నిలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Read Also: Rajasthan: ఒంటరి మహిళలే టార్గెట్.. ఎదిరిస్తే బెదిరింపులు.. కత్తులతో దాడులు
కొత్త స్కూటర్ ‘మూవ్ఓఎస్’ సాఫ్ట్‌వేర్’తో రానుంది. కాగా ఓలా ఎలక్ట్రిక్ గతేడాదే ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మార్కెట్లో దీని ధర రూ.99,999గా ఉంది. ప్రస్తుతం ఓలా కంపెనీకి చెందిన వాహనాలు ఓలా ఎస్1, ఎస్1 ప్రో అధునాతన స్కూటర్లు. వీటిల్లో మ్యూజిక్ ప్లే బ్యాక్, నావిగేషన్, కాంపేనియన్ అప్లికేషన్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్న మూవ్ఓఎస్‌తో తయారయ్యాయి. కాగా రెండేళ్లలో ఎలక్ట్రిక్ కారును కూడా మార్కెట్‌లోకి తీసుకురావాలని ఓలా భావిస్తోంది. రోజుకు 1000 స్కూటర్లు చొప్పున విక్రయిస్తున్నట్టు ఓలా చెబుతోంది. అయితే ఫైర్ యాక్సిడెంట్ల నేపథ్యంలో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఒక్కసారి ఛార్జింగ్‌తో 500 కిలోమీటర్లు నడిచేలా ఈ కారుని తయారు చేయాలని భావిస్తోంది.
Read Also: Flipkart Diwali Sale: వచ్చేస్తోంది..ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్..! 80 శాతం మేర భారీ తగ్గింపు..!
ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ కారు విడుదల చేయడానికి సిద్దమవుతున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. కావున ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన కొత్త టీజర్ కూడా గత ఆగష్టు 15 న విడుదల చేశారు. ఈ ఎలక్ట్రిక్ కారు ధర కూడా సుమారు రూ. 50 లక్షల వరకు ఉంటుందని సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు. ఓలా ఎలక్ట్రిక్ తన తన ఎలక్ట్రిక్ కారుని 2024 నాటికి భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కావున ఇది ఇంకో రెండు సంవత్సరాల్లో భారతీయ రోడ్లపైన తిరగడానికి సిద్ధమవుతోంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 500 కిమీ రేంజ్ అందిస్తుందని కూడా ఇప్పటికే తెలిపారు.