NTV Telugu Site icon

Okaya EV Scooters Offers: ఒకయా ఈవీ స్కూటర్లపై భారీ తగ్గింపు.. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్!

Okaya Ev Scooter

Okaya Ev Scooter

Okaya EV Offers in Monsoon Cashback Scheme: ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ‘ఒకాయా’ గ్రూప్.. తన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కంపెనీ రెండేళ్ల వార్షికోత్సవం సందర్భంగా ఆఫర్ ప్రకటించింది. జూలై 31 వరకు కంపెనీ అందిస్తున్న మాన్‌సూన్ క్యాష్‌బ్యాక్ స్కీమ్‌తో కలిపి ఈ తగ్గింపులు ఉంటాయి. భారత ప్రభుత్వం ఎఫ్ఏఎంఈ-II సబ్సిడీల్లో తగ్గింపును ప్రకటించిన తర్వాత.. ఈవీ స్కూటర్ల ధరలు పెరిగాయి. సబ్సిడీల తగ్గింపు తర్వాత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సేల్స్ కాస్త తగ్గాయి. దాంతో తమ సేల్స్‌ను నిలబెట్టుకునేందుకు ‘ఒకాయా’ ఈ ఆఫర్లను ప్రకటించింది.

ఎంట్రీ లెవల్ ఒకాయా క్లాస్ ఐక్యూ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ రూ. 74,999 (ఎక్స్-షోరూమ్) కంటే తక్కువగా అందుబాటులో ఉంది. ఒకాయా ఫాస్ట్ ఎఫ్2టీ, ఎఫ్2బీ ఎలక్ట్రిక్ స్కూటర్లు రూ. 1 లక్షలోపే అందుబాటులో ఉన్నాయి. ఒకాయా ఫాస్ట్ ఎఫ్1టీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 99,950కి కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్‌పై రూ. 10,800 తగ్గింపు ఉంది. అదే సమయంలో ఒకాయ ఫాస్ట్ ఎఫ్2బీ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ. 8,500 తగ్గింపు ఉండగా.. రూ. 99,400కి అందుబాటులో ఉంది.

ఒకాయా కంపెనీ జూలై 31 వరకు మాన్‌సూన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఒకాయా ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. 5000 వరకు విలువైన క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అంతేకాదు రూ. 50000 విలువైన థాయిలాండ్ ట్రిప్‌ను (నాలుగు రోజుల ట్రిప్‌) కూడా గెలుచుకునే అవకాశం ఉంది. ఫాస్ట్ ఎఫ్4, ఫాస్ట్ ఎఫ్3, ఎఫ్2బీ, ఎఫ్2టీ ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుపై ఈ ఆఫర్స్ ఉన్నాయి. మరోవైపు ప్రతి కొనుగోలుపై రూ. 500 నుంచి రూ. 5000 వరకూ క్యాష్‌బ్యాక్‌ వస్తాయి.

Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు! తులం ఎంతంటే?

Also Read: West Bengal: ఉద్రిక్తతల మధ్య నేడు బెంగాల్ పంచాయతీ ఎన్నికలు..

 

Show comments