Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!

  • నూనె చుక్క కూడా ఉపయోగించకుండా ఎయిర్ ఫ్రైయర్‌తో పూరీలు..
  • నూనెకు బదులుగా నీరు, ఆవిరి సహాయంతో పూరీలు..
  • పూరీలను ముందుగా మరిగే నీటిలో వేసి ఉడికించి, తర్వాత ఎయిర్ ఫ్రైయర్‌లో..
Oil Free Puri

Oil Free Puri

Oil-Free Poori: మనలో చాలామందికి పూరీలు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే వాటిని నూనెలో వేయించి తినడం వల్ల బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం లాంటి సమస్యలు వస్తాయని భయపడి కొంతవరకు దూరంగా ఉంటారు. నిజానికి ఇకపై అలాంటి భయం అవసరం ఏమాత్రం లేదు. నూనె పూర్తిగా వాడకుండానే.. నీళ్లు, ఎయిర్ ఫ్రైయర్ సహాయంతో రుచికరమైన, పొంగిన పూరీలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. డైట్ చేసేవాళ్లు కూడా వీటిని హాయిగా తినవచ్చు. మరి ఎలా చేయాలో చూసేద్దామా..

సాధారణ పూరీలు నూనెలో వేయించడం వల్ల అధిక కేలరీలు, ఊబకాయం ప్రమాదం పెరుగుతాయి. కానీ ఈ పద్ధతిలో నూనె బదులు నీళ్లు, ఆవిరి ఉపయోగిస్తాం. కాబట్టి ఇది తేలికగా జీర్ణమయ్యేలా ఉంటుంది. ఎయిర్ ఫ్రైయర్‌లో చేయడం వల్ల పూరీలు బాగా పొంగి, క్రిస్పీగా వస్తాయి.

కావాల్సిన పదార్థాలు:

* గోధుమ పిండి
* ఉప్పు
* 2 టీస్పూన్ల పెరుగు (నూనె లేకపోవడం వల్ల పిండి మెత్తగా ఉండటానికి)
* నీళ్లు
* ఎయిర్ ఫ్రైయర్

పిండి తయారీ:

మైదా పిండిలో ఉప్పు, పెరుగు కలిపి మెత్తని పిండి తయారు చేయండి. బాగా కలిపిన తర్వాత దానిని ఒక 15 నిముషాలపాటు ఒక గిన్నెలో పెట్టి పైన ఒక గుడ్డతో మూసేసి అలా ఉంచేయండి. ఆ తరువాత పిండిని చిన్న ఉండలు చేసి, పూరీలకు సరిపోయేలా సన్నగా ఒత్తుకోండి.

ఆ తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసి మరగనివ్వండి. ఆ నీటిలో పూరీలను ఒక్కొక్కటిగా వేయండి. నీళ్లు మరిగేటప్పుడు పూరీలు పైకి తేలుతాయి. వాటిని అలాగే కాసేపు ఉంచి తీసేయండి. ఇప్పుడు వాటిని ఎయిర్ ఫ్రైయర్‌ లో 180 డిగ్రీల వద్ద ప్రీహీట్ చేయండి. ఉడికించిన పూరీలను లోపల పెట్టి 3 నిమిషాలు ఉంచండి. అంతే పూరీలు చక్కగా పొంగి, బంగారు రంగులోకి వస్తాయి. ఈ సింపుల్ పద్ధతితో ఇంట్లోనే ఆయిల్ ఫ్రీ పూరీలు తయారు చేసుకుని, కుటుంబంతో కలిసి ఆనందంగా తినండి.