Site icon NTV Telugu

OG : ఆకలితో వున్న అభిమానులకు ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

Whatsapp Image 2023 12 12 At 7.32.48 Pm

Whatsapp Image 2023 12 12 At 7.32.48 Pm

టాలీవుడ్‌ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్న విషయం తెలిసిందే… వీటిలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు మరియు సాహో ఫేం సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఓజీ’. అలాగే హరీష్‌ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ వంటి సినిమాలు పవన్ కల్యాణ్ లైనప్ లో వున్నాయి.అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం లో పవన్‌ కల్యాణ్‌ రాజకీయ సమావేశాలతో బిజీగా మారిపోయాడు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పవన్ సినిమాల షూటింగ్స్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తుంది.అయితే వీటిలో మోస్ట్ ఎవెయిటెడ్‌ ప్రాజెక్ట్‌ ఓజీ గురించి మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. టైమ్‌లైన్‌ బర్త్ డే విషెస్‌తో నిండిపోయింది. అభిమానులు ఎంతో ఆకలితో ఉన్నారు. మీకు చెప్పాల్సింది ఏంటంటే.. ప్రస్తుతానికి మేము షూటింగ్ చేయడం లేదు. కాబట్టి అప్‌డేట్స్‌ కోసం మరికొంత సమయం పడుతుంది.. అందుకే అప్పుడే వేచి చూడకండి అని మేకర్స్ ట్వీట్ చేశారు.

దీనితో పవన్‌ కల్యాణ్‌ ను ఓజీగా సిల్వర్ స్క్రీన్‌పై చూడాలంటే మరి కొంత కాలం పడుతుంది.. అప్పటి వరకు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే మరి.అయితే ఇప్పటికే ఓజీ నుంచి ‘హంగ్రీ చీత’ అంటూ లాంఛ్‌ చేసిన గ్లింప్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఆ గ్లింప్స్ వీడియో పవర్‌స్టార్ అభిమానులకు ఎంతగానో నచ్చేసింది.ఓజీ మూవీ లో పవన్‌ కల్యాణ్‌ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా స్టైలిష్‌ అవతార్‌లో కనిపిస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేయనున్నారు.. ఓజీ మూవీ లో గ్యాంగ్ లీడర్‌ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్‌ పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.ఓజీ మూవీ తో పాటు హరీష్‌ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ఫస్ట్‌ గ్లింప్స్ వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంది. గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ పవర్ ఫుల్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో సినిమా పై భారీగా అంచనాలు వున్నాయి.

Exit mobile version