పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఓజి.టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతానికి పైగానే పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా తెలిపారు.. మిగతా భాగం కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం.మేకర్స్ ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కి విడుదల చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం… డిసెంబర్ లోనే ఈ సినిమా విడుదల చేయాలని షూటింగ్ స్పీడ్ గా పూర్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పుడు మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఇంతకు ముందు ఓజి టీజర్ రాబోతుంది అని మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే…పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న పుట్టిన రోజు జరుపుకోనున్నారు.ఆయన బర్త్ డే కానుకగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ కాదు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అద్భుతమైన టీజర్ ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఒక అప్డేట్ ఇచ్చారు…
ఈ టీజర్ ఉందని చెప్పినప్పటి నుండి ఎప్పుడు విడుదల అవుతుందా టైం చెప్పండి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ను అడుగుతూనే ఉన్నారు.. దీంతో తాజాగా వారు ఏ టైం కు సెప్టెంబర్ 2న మనం మొదలు పెట్టాలో మీరే చెప్పండి అంటూ ఇవాళ మార్నింగ్ చెప్పుకొచ్చారు.. సాయంత్రం లోపు ఒక పర్ఫెక్ట్ టైం ఫిక్స్ చేద్దాం అని వారు తెలిపారు.చెప్పినట్టుగానే ఓజి టీజర్ టైం ను ప్రకటించారు మేకర్స్.’ఓజి ‘ఆకలితో ఉన్న పులి (హంగ్రీ చీతా) సెప్టెంబర్ 2 ఉదయం 10.35 గంటలకు రానుందని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. ఓజీ టీజర్ 70 సెకన్ల నిడివితో ఉంటుందని సమాచారం.నటుడు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌తో ఎలివేషన్ డైలాగ్స్ కూడా ఉంటాయని సమాచారం. ఈ సినిమాలో పవర్‌ఫుల్ గ్యాంగ్‍స్టర్‌లా పవన్ కల్యాణ్ కనిపించనున్నారు. దీంతో ఓజీ టీజర్ పై పవన్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
https://twitter.com/DVVMovies/status/1697246706084327516?s=20