Site icon NTV Telugu

OG : ‘ఓజి’ మూవీ కోసం మరోసారి పాట పాడనున్న పవర్ స్టార్..

Whatsapp Image 2024 01 17 At 2.41.28 Pm

Whatsapp Image 2024 01 17 At 2.41.28 Pm

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఫుల్ బిజీగా ఉన్నారు.మరోవైపు వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఎంతగానో అలరిస్తున్నారు..రీసెంట్ గా బ్రో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ లైనప్ లో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ వంటి భారీ సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ టైటిల్‌తో వస్తున్న ఓజీ మూవీ కి యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.పవన్ కల్యాణ్ హీరోగానే కాకుండా సింగర్‌గా కూడా తానేంటో నిరూపించుకున్నారు.గతంలో అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడా అనే పాట పాడి తన గాత్రం వినిపించారు. ఆ సినిమాలో ఆ పాటఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..

అలాగే పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మరో సినిమా అజ్ఞాతవాసి సినిమాలో కొడకా కోటేశ్వర్ రావు వంటి పాటతో సింగర్‌గా పవన్ కల్యాణ్ ఎంతగానో అలరించాడు. తాజాగా మరోసారి తన పాటతో ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నాడట పవన్ కల్యాణ్.ఓజీ సినిమాకు ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. “ఓజీ స్క్రిప్ట్‌లో పవన్ గారి చేత పాట పాడించడానికి చాలా అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.. మేం ఆ అవకాశాలను పరిశీలిస్తున్నాం” అని తాజాగా సూపర్ సింగర్ సీజన్ 2కి గెస్టుగా వెళ్లిన తమన్ చెప్పుకొచ్చారు.అలాగే ఈ సినిమాకు తమన్ ఇప్పటికే కొన్ని ట్యూన్స్ ఇచ్చారు . వాటిలో ఓ పాటను పుణెలో షూటింగ్ కూడా చేశారు.ఓజీలో పవన్ కల్యాణ్‌కు జోడీగా మలయాళ క్యూట్ భామ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది.. ఓజీ సినిమాను డీవీవీ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. శ్రీమతి పార్వతి సమర్పిస్తున్నారు. ఓజీ సినిమాలో పవన్, ప్రియాంకతోపాటు బాలీవుడ్ పాపులర్ హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఓజీలో సీరియల్ కిస్సర్‌గా పేరొందిన ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్నాడు.

Exit mobile version