Site icon NTV Telugu

OG : 4 రోజులు 252 కోట్ల విధ్వంసం

Og Movie

Og Movie

OG : పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందించబడిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే సినిమా అదిరిపోయింది అంటూ సంబరాలు చేసుకున్నారు. అయితే నార్మల్ ఆడియన్స్ మాత్రం రొటీన్ సినిమానే కానీ పవన్ కళ్యాణ్‌ని కొత్తగా చూడటం బాగుందని అన్నారు. ఏదైతేనేం, ఈ సినిమా నాలుగు రోజులలో 252 కోట్ల రూపాయల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వసూలు చేసినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాని డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద డి.వి.వి దానయ్య ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించాడు. వీరు కాకుండా ఈ సినిమాలో శ్రీయ రెడ్డి, ప్రకాష్ రాజ్, రాహుల్ రవీంద్రన్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది.

READ ALSO: Arattai App: అదరగొడుతున్న ‘అరట్టై’ యాప్.. వాట్సప్‌తో పోరుకు సిద్ధమైన ఇండియన్ యాప్!

Exit mobile version