NTV Telugu Site icon

Vikarabad: డబ్బులే కాదు… అప్పుడప్పుడు జర జనాల ప్రాణాలు కూడా చూడుర్రి డ్రైవర్ బ్రో

Tandur

Tandur

ఆ ప్రాంతంలో చిన్నచిన్న వాహనాలతో రోడ్లపైకి వాహనదారులు రావాలంటే జంకుతున్నారు. ఎప్పుడు ఏ పక్క నుంచి ప్రమాదం జరుగుతుందోనని ప్రాణం భయంతో వణికిపోతున్నారు. కానీ తమ అవసరాల కోసం రోడ్లపైకి రాక తప్పడం లేదు అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రాంతంలో నానా రకాల వ్యాపారాలు భారీ ఎత్తున కొనసాగుతుంటాయి.. ముఖ్యంగా ఇక్కడ భారీగా నాపరాతి గనులు ఉండడంతో బండల రవాణా కూడా కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో నాపరాతి ఘనుల ద్వారా తీసిన బండల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా జరుగుతుంది. ఇదంతా బాగానే ఉన్నా నాపరాతి గనుల నిర్వాహకుల తిరుపట్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Read Also: Toll Collection: రికార్డ్ స్థాయికి చేరుకున్న టోల్ కలెక్షన్.. రూ.4వేల కోట్లు దాటిన నెలవారీ వసూళ్లు

నాపరాతిని తమకున్న ఆర్డర్ల కోసం వివిధ ప్రాంతాలకు లారీలలో, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. కానీ వాటిని తరలింపు ఇతర వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. నాపరాతి బండలను లారీలలో, ట్రాక్టర్లలో బాడీ లెవెల్ వరకు నింపకుండా.. అధిక లోడ్డుతో వెహికిల్స్ లో నింపుకొని రోడ్లపైకి రావడం వల్ల.. వెనక వచ్చే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ వాహనాల్లో ఉన్న పెద్ద పెద్ద రాళ్లు రోడ్లపై ప్రయాణిస్తున్న పక్కనే ప్రయాణిస్తున్న వాహనదారుల మీద పడి ప్రమాదాలు జరిగిన ఘటనలు తాండూర్ ప్రాంతంలో చాలానే చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా బండలను కటింగ్ చేయగా మిగిలిన వేస్టేజ్ కూడా ట్రాక్టర్లలో, లారీలలో నింపుకొని గుంతల మాయమైన రోడ్లపై అతివేగంగా వెళ్లడంతో గుంతల దగ్గర ఆ రాళ్లు పడి వాహనదారులు గాయాలు పాలవుతున్నారు.

Read Also: Multibagger Stocks: రూ.లక్ష పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు రూ. 7.25 కోట్ల రూపాయలు వచ్చేవి

వాహన పరిమితికి మించిన లోడుతో వెళ్తున్న వాహనాలను అటు ఆర్టీఏ అధికారులు కానీ.. ఇటు పోలీసు అధికారులు కానీ నియంత్రించడంలో విఫలమయ్యారు అని స్థానికులు అంటున్నారు. మరోవైపు ఈ ప్రాంతంలో కంపెనీలు ఉండడంతో భారీ లోడుతో వాహనాలు వెళ్తున్నాయి.. ఆర్టీఏ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ప్రమాదకరంగా వెళ్తున్న వెహికిల్స్ పై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని వాహనదారులు ఆరోపణలు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా చూడాల్సి స్థానిక పోలీసులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. నిత్యం పోలీస్ స్టేషన్ ముందే నుంచి ఈ వెహికిల్స్ తిరిగిన వాటిని పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఏదైన ప్రమాదం జరిగినప్పుడు నానా హంగామా చేసే అధికారులు అధిక లోడుతో వెళ్తున్న వెహికిల్స్ ను కంట్రోల్ చేయడంలో విఫలమవుతున్నారని స్థానికులు అంటున్నారు.

Read Also: Harish Rao: సిద్ధిపేటలో హాఫ్ మారథాన్ రన్ ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

ఇప్పటికైనా నాపరాతి బండలను అధిక లోడుతో తీసుకెళ్తున్న ట్రాక్టర్లు, లారీలపై అధికారులు దృష్టి సాదించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాహనాలపై రక్షణ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా మట్టిలోడుతో వెళుతున్న వాహనాలు వాటి వేగానికి వెనకాల నుంచి వచ్చే ద్విచక్ర వాహనదారుల కళ్ళల్లో ఆ మట్టి పడటం వల్ల ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉన్నాయని ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు వేడుకుంటున్నారు.