NTV Telugu Site icon

Libya Flood: లిబియాలో వరద బీభత్సం.. చెల్లాచెదురుగా మృతదేహాలు

Libiya Floods

Libiya Floods

లిబియాలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలు ముంచేశాయి. డేనియల్ తుపానుతో వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. వరదల కారణంగా లిబియాలోని డెర్నా నగరంలో దాదాపు పావు వంతు కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా.. ఈ విపత్తు కారణంగా సుమారు 20 వేల మంది మరణించి ఉండొచ్చని మేయర్ తెలిపారు.

Pakistan: పాకిస్థాన్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ.. వరల్డ్ కప్ నుంచి స్టార్ బౌలర్ ఔట్

డెర్నా నగర వీధులు, సముద్ర తీరం నదీ ఒడ్డున ఎక్కడ చూసినా.. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మరోవైపు ఈ విధ్వంసకర ప్రళయం అక్కడి జనాలు మాట్లాడుతూ.. ఆదివారం డెర్నాలో సునామీ లాంటి వరద సంభవించిందని, ప్రజలు తమను తాము రక్షించుకునే లోపు వరదలు సముద్రం వైపు కొట్టుకుపోయిందని చెప్పారు.

Viral Video: అబ్బా.. తమ్ముడు.. ఇక కుమ్ముడే.. వీడియో చూస్తే పొట్ట చెక్కలు అవ్వాల్సిందే..

ఈ వరదల్లో వేలాది మంది జనాలు తప్పిపోగా.. సముద్రం ఒడ్డున మృతదేహాలు దర్శనమిస్తున్నాయి. దీంతో తమ వాళ్ల కోసం మృతదేహాలను వెతుక్కునే పనిలో పడ్డారు. మహోగ్రరూపమై విరుచుకుపడ్డ తుపాన్ ధాటికి రెండు డ్యామ్ లు బద్ధలయ్యాయి. దీంతో డెర్నా నగరం భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని చవిచూసింది. లక్షన్నర టన్నుల బరువున్న నీరు 7 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతూ ఆ నగరాన్ని తుడిచిపెట్టేసింది. ఆ మహా విళయానికి ఆ నగరంలో ప్రతీ ఇంటిలో మృతి చెందారు.

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్‌ ఎన్టీఆర్‌ మౌనం.. టీడీపీ సంచలన వ్యాఖ్యలు..

90 వేల జనాభా కలిగిన డేర్నాలో వేలమంది గల్లంతయ్యారని సహాయక బృందాలు వెల్లడించాయి. వీధులు, శిథిలమైన భవనాలు, సముద్ర తీరాలు, నదులు, ఇళ్లు ఎక్కడ చూసినా మృతదేహాలు కుప్పలుకుప్పలుగా కనిపిస్తున్నాయి. డేనియల్ తుపాన్ ధాటికి గల్లంతైన వేలాది మంది ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు లిబియా అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబు లమౌషా వెల్లడించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు.