Site icon NTV Telugu

Eluru-SAI: మహిళా క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు.. నిజమే అని తేల్చిన అధికారులు!

Eluru Sai

Eluru Sai

ఏలూరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్‌)లో మహిళా క్రీడాకారిణులపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. క్రీడల్లో మేటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దాల్సిన కోచ్‌లు కీచకులుగా మారారంటూ క్రీడాకారిణులు స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు పిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు వేదింపులు నిజమేనని నిర్ధారించారు.

Also Read: Kurnool District: బీజేపీలో చేరిన కొడుమూరు మాజీ ఎమ్మెల్యే!

ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియం పక్కనే ఉన్న శాయ్ హాస్టల్లో మహిళా క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు ఎక్కువ అవడంతో కేంద్ర శాయ్ కార్యాలయానికి వారు ఫిర్యాదు చేశారు. 10 మంది మహిళా క్రీడాకారిణులు శాయ్‌ నిర్వాహకులు, వెయింట్‌ లిఫ్టింగ్‌ కోచ్‌పై ఫిర్యాదు చేశారు. క్రీడాకారిణుల ఫిర్యాదుపై శాయ్‌ కేంద్ర కార్యాలయంలోని ఇద్దరు సభ్యుల బృందం గత కొద్దిరోజులుగా రహస్య విచారణ చేపట్టింది. ఆరోపణలు వాస్తవేనని నిర్ధారించింది. లైంగిక వేధింపులకు పాల్పడిన కోచ్‌లపై ఏలూరు టూటౌన్‌ స్టేషన్లో పిర్యాదు చేశారు. హాస్టల్ ఇన్‌చార్జ్‌, అథ్లెటిక్స్ కోచ్ ప్రసాద్‌పై సెక్షన్ 75 బీఎన్ఎస్ 8 ఆఫ్ పోక్సో యాక్ట్ క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కోచ్‌పై కేసు నమోదు విషయంలో రాజకీయ ఒత్తిడులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Exit mobile version