Site icon NTV Telugu

Suriya46 : సూర్య – వెంకీ అట్లూరి సినిమా టైటిల్ ను ప్రకటించిన మేకర్స్

Suriya

Suriya

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరియు టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘సూర్య 46’గా  తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి విశ్వనాథ్ అండ్ సన్స్‘  అనే క్లాసిక్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ అఫీషియల్ గా ఖరారు చేసింది. ఈ  ఉదయం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టర్‌లో సూర్య ఒక చిన్న బాబును ఎత్తుకుని పాల డబ్బాతో క్లాస్‌గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

Also Read : Toxic : ‘టాక్సిక్’ కోసం రవి బస్రూర్ మ్యూజికల్ మ్యాజిక్..

ఈ చిత్రం కేవలం టైటిల్‌తోనే కాకుండా రిలీజ్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది జూలైలో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. వేసవి తర్వాత రాబోతున్న ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూర్య తన సత్తా చాటడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘లక్కీ భాస్కర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  మలయాళ సెన్సేషన్ మమితా బైజు కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్, సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక మధ్యవయస్కుడికి మరియు ఒక యువతికి మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Exit mobile version