Rajini’s 170th film : సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ వయసులో కూడా చాలా చురుగ్గా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మంచి వ్యాయామం, సమతుల్య ఆహారంతో అతను తనను తాను ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. గత సంవత్సరం అన్న సినిమా తరువాత, ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో నటిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని చిత్ర బృందం ప్రకటించింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసి ఈ ఏడాది చివర్లో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. రజనీకాంత్‌తో పాటు ఈ సినిమాలో రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, మోహన్‌లాల్ పలువురు నటిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. రజనీ, నెల్సన్ ఇద్దరూ ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలని, ఈ సినిమా కోసం తమ శక్తి మేర ప్రయత్నిస్తున్నారు.
Read Also: Katrinakaif : ప్రెగ్నెంట్ అయిన కత్రినా కైఫ్ ?
అనంతరం రజనీ తన పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న లాల్ సలామ్ చిత్రంలో జాయిన్ అవుతారు. ఈ చిత్రంలో రజనీ ముస్లిం మత పెద్దగా కనిపించనుండగా, మీసాలు, పొడవాటి గడ్డం పెంచుతున్నట్లు సమాచారం. మరోవైపు రజనీకాంత్ 170వ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుందని ప్రకటించారు. డీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం నిజ సంఘటనల ఆధారంగా రూపొందించనున్నట్లు సమాచారం. ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా పోరాడే రిటైర్డ్ ముస్లిం పోలీసు అధికారిగా రజనీ కాంత్ నటించనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జ్ఞానవేల్ తన మొదటి సినిమా జైభీమ్ లాగే రెండో సినిమాతోనూ ప్రభంజనం సృష్టిస్తాడని అంచనా వేస్తున్నారు. మొదటి సినిమాలాగే యదార్థ సంఘటనల ఆధారంగా జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని ప్లాన్ చేసాడు. ఈ చిత్రం అభిమానులకు వైవిధ్యమైన అనుభవాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా కూడా కోర్టు, జైలు వంటి నేపధ్యంలో తీయనుండడంతో.. ఇందులో ఆయన ఎలా వైవిధ్యం తెస్తాడో అని అభిమానులు వేచి చూస్తున్నారు.
Read Also: Monday Stothra parayanam live: సోమవారం ఈ స్తోత్రాలు వింటే..