Site icon NTV Telugu

HHVM: వెనక్కి తగ్గిన వీరమల్లు.. విడుదల తేదీపై అధికారిక ప్రకటన

Hhvm

Hhvm

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘హరి హర వీర మల్లు’ ఒకటి. ఈ చిత్ర విడుదల గురించి జరుగుతున్న ప్రచారాలు, పెరుగుతున్న ఊహాగానాలు నేపథ్యంలో నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు. “అచంచలమైన ఓపిక, నమ్మకంతో ‘హరి హర వీరమల్లు’ సినిమాకు తోడుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రేమికులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.గతంలో ప్రకటించిన జూన్ 12వ తేదీకి చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్నాము. అయినప్పటికీ ఆ తేదీకి చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాలేకపోతున్నామని తెలియజేస్తున్నాము.

Also Read:Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభంకు క్యాన్సర్..! కూతురు క్రాంతి తీవ్ర ఆవేదన

కష్టమైనయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మరింత గొప్పగా మలచాలనేదే మా ప్రయత్నం. ప్రతి ఫ్రేమ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాము. అందుకే మేము మరి కొంత సమయం తీసుకుంటున్నాము. మీ ఎదురుచూపులకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాము.”

Also Read:Kamal Haasan: రాజ్యసభకు కమల్‌ హాసన్‌ నామినేషన్‌.. హాజరైన సీఎం స్టాలిన్!

మరోవైపు, సామాజిక మాధ్యమాల్లో ‘హరి హర వీరమల్లు’ చిత్రం గురించి తప్పుడు వార్తలు ప్రచారమవ్వడం మేము గమనించాము. చాలామంది తమకు తోచినది రాసేస్తున్నారు. ధృవీకరించని వార్తలను నమ్మవద్దని, వాటిని వ్యాప్తి చేయవద్దని మేము ప్రతి ఒక్కరినీ కోరుతున్నాము. దయచేసి మా అధికారిక హ్యాండిల్స్ ద్వారా మాత్రమే సినిమాకి సంబంధించిన అప్డేట్ల కోసం వేచి ఉండండి. అప్పటి వరకు, ఎటువంటి ప్రచారాలను నిజమని భావించకండి. ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఒక అద్భుతమైన ప్రయాణం. వందలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు కలిసి వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి 24 గంటలూ తమ శక్తికి మించి కృషి చేస్తున్నారు.

Also Read:Kamal Haasan: రాజ్యసభకు కమల్‌ హాసన్‌ నామినేషన్‌.. హాజరైన సీఎం స్టాలిన్!

ఈ ఆలస్యం మన సహనాన్ని పరీక్షించవచ్చు. కానీ, అంతకంటే గొప్పది ఏదో రూపుదిద్దుకుంటుందని కూడా ఇది సూచిస్తుంది. ప్రతి దృశ్యం ఆశ్చర్యపరిచేలా, ప్రతి శబ్దం ప్రతిధ్వనించేలా, ప్రతి సన్నివేశం ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం నిర్మాణాంతర కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది. ‘హరి హర వీరమల్లు’ భారీ, శక్తివంతమైన థియేట్రికల్ ట్రైలర్ త్వరలో విడుదల కానుందని తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ట్రైలర్‌తో పాటు, కొత్త విడుదల తేదీని కూడా తెలియజేస్తాము. కాబట్టి భారీ ప్రకటన కోసం వేచి ఉండండి. సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. అద్భుతమైన ట్రైలర్ ను మీతో పంచుకోవడానికి మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము. అద్భుతాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి.

Also Read:Rekha Gupta: సీఎం రేఖా గుప్తాకు అధికారిక బంగ్లా కేటాయింపు.. కొత్త అడ్రస్ ఎక్కడంటే..!

ఈ చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా అటు విజువల్ పరంగానూ, ఇటు మ్యూజిక్ పరంగానూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించనుంది. సినీ ప్రియుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా రూపొందుతోంది. మీ నిరంతర మద్దతు, ప్రేమ, ఓర్పుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. తుఫాను అతి త్వరలో రాబోతోంది. చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోందంటు ప్రకటించారు.

Exit mobile version