రాష్ట్రంలో రోజు రోజుకు పులులు, చిరుతల సంచారం పెరుగుతోంది. జనారణ్యంలోకి వచ్చి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే.. తాజాగా సంగారెడ్డి జిల్లాలోనూ ఓ చిరుత సంచరించింది. ప్రముఖ మందుల తయారీ సంస్థ హెరిటో పరిశ్రమలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెరిటో పరిశ్రమలో చిరుత సంచారం ఉద్యోగులను పరుగులు పెట్టించింది. హెరిటో పరిశ్రమలో హెచ్ బ్లాక్ లో చిరుత దాగి ఉందని అటవీ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు.
Also Read :Hair Colouring: జుట్టుకు రంగు వేస్తున్నారా? జాగ్రత్త
దీంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీం చిరుతను ఎంతో శ్రమపడి బోనులో బంధించారు. చిరుతకు మత్తుమందు ఇచ్చి పట్టుకున్నారు అధికారులు. అయితే.. చిరుతను ఫారెస్ట్ వాహనంలో ఎక్కించి.. బోనుని తీసేశారు. మత్తు ఇచ్చినా చిరుత కళ్ళు తెరిచి చూస్తున్నట్లు.. చిరుత ఆరోగ్యంగానే ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా NTV తో DFO శ్రీధర్ రావు మాట్లాడుతూ.. ఈ చిరుత రెస్క్యూ ఆపరేషన్ లో 30 మంది సిబ్బంది పాల్గొన్నారని, మొత్తానికి రెస్క్యూ సక్సెస్ అయ్యిందని, చిరుత మాకు ముప్పు తిప్పలు పెట్టిందన్నారు. గతంలో చేసిన రెస్క్యూ వేరు ఇప్పుడు చేసిన రెస్క్యూ పెద్ద టాస్క్ అని, చిరుత ఆరోగ్యంగా ఉందని ఆయన వెల్లడించారు. మత్తుతో కొద్దిగా డి హైడ్రేషన్ అవుతుంది కాబట్టి ప్రథమ చికిత్స అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
