Site icon NTV Telugu

Reservoir Lifting Effect: ఈ సెల్పీ చాలా కాస్లీ గురూ..!

Reservoir Lifting Effect

Reservoir Lifting Effect

Reservoir Lifting Effect: అతనో ప్రభుత్వ ఉద్యోగి.. సరదా కోసం ఒక డ్యామ్‌ దగ్గర సెల్ఫీ తీసుకున్నాడు. సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో తన చేతిలోని ఫోన్‌ కాస్త రిజర్వాయర్‌లో పడిపోయింది. ఫోన్‌ విలువైందని తనకు తిరిగి ఫోన్‌ కావాలని భావించాడు. డ్యామ్‌లోని నీటిని మోటార్లు పెట్టి తోడించాడు.. మూడు రోజుల అనంతరం అతనికి ఫోన్‌ దొరికింది. ఈ లోపు విషయం కాస్త ఉన్నతాధికారులకు విషయం తెలియడంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు.. ఇపుడు ప్రజలకు తాగు, సాకు కోసం ఉపయోగపడే నీటిని వృదా చేసినందుకు జరిమాన ఎందుకు విధించకూడదో చెప్పాలని నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఛత్తీస్‌గఢ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తన ఖరీదైన ఫోన్‌ను రికవరీ చేయడానికి రిజర్వాయర్ నుండి 21 లక్షల లీటర్ల నీటిని తీసివేసినందుకు సస్పెండ్ చేయబడిన కొన్ని రోజుల తర్వాత, ప్రభుత్వం అతని సీనియర్‌ను పైకి లాగింది, అతను ఐదు అడుగుల వరకు నీటిని ఖాళీ చేయడానికి మౌఖిక అనుమతి ఇచ్చాడని చెప్పాడు. డ్యామ్‌లో నీటిని తొలగించమని ఆదేశించినందుకు సీనియర్ అధికారికి ₹ 53,000 జరిమానా విధించబడింది.
ఇంద్రావతి ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ తన జీతం నుంచి వృథాగా పోతున్న నీటి ఖర్చును ఎందుకు వసూలు చేయకూడదని సబ్ డివిజనల్ అధికారి ఆర్కే ధివర్‌కు ఈనెల 26న లేఖ రాశారు. వేసవిలో సాగునీరు, ఇతర అవసరాల కోసం అన్ని రిజర్వాయర్లలో నీరు అవసరమని లేఖలో సూచించారు. కాంకేర్ జిల్లా ఫుడ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రాజేశ్‌ విశ్వాస్‌ మే 20న తన స్నేహితులతో కలిసి పరల్‌కోట్‌ డ్యామ్‌ సందర్శనకు వెళ్లారు. అక్కడ సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ రూ.లక్ష విలువైన స్మార్ట్‌ఫోన్‌ నీళ్లలో పడిపోయింది. ఖరీదైన ఫోన్‌ రిజర్వాయర్‌లో పడిపోవడంతో 15 అడుగుల లోతైన ఆ రిజర్వాయర్‌ నీటిలో గజ ఈతగాళ్లతో గాలించారు. అయినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో నీటి పారుదల శాఖలో తనకు తెలిసిన అధికారులను సంప్రదించి సాయం కోరాడు.

నీటిపారుదల శాఖ అధికారి నుంచి మౌఖికంగా ఆదేశాలు అందుకున్న సిబ్బంది.. రెండు భారీ మోటార్లతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మూడు రోజుల పాటు 21 లక్షల లీటర్ల నీటిని బయటకు తోడేశారు. వేసవిలోనూ 10 అడుగుల మేర నీళ్లుండే రిజర్వాయర్.. స్థానిక రైతుల సాగుకు, జంతువులకు తాగునీటికి ఉపయోగపడుతోంది. బయటకు తోడేసిన నీటితో 1500 ఎకరాలు సాగు చేయవచ్చు. ఫోన్ కోసం రిజర్వాయర్‌లోని నీటిని తోడేస్తున్న విషయం వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. స్పందించిన జలవనరుల శాఖ అధికారులు వెంటనే ఆ ప్రక్రియను నిలిపివేయించారు.
ఘటనపై రాజేశ్ విశ్వాస్‌ వివరణ ఇస్తూ తన తప్పేమీ లేదని … ఆ రిజర్వాయర్‌లోని నీటిని ఏ అవసరాల కోసం వినియోగించడంలేదని, నీళ్లు తోడేస్తే ఫోన్ దొరుకుతుందని స్థానికులు, జల వనరుల శాఖకు చెందిన అధికారులు కూడా ఇదే విషయాన్ని చెప్పారని, అందుకే మోటార్లతో నీటిని తోడించేయించినట్టు చెప్పారు.

Exit mobile version